పార్లమెంట్‌లో పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్‌గా సీనియర్ టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు నియమితులయ్యారు. పార్లమెంట్ లో స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్ లో స్థాయి సంఘం చైర్మన్‌లకు కెబినేట్ ర్యాంకు హోదా ఉంటుండగా కేంద్రంలో టిఆర్ఎస్ గళం వినిపిస్తున్న కేశవరావుకు ఈ పదవి దక్కడం పై హర్షం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరి ముఖ్యమంత్రి కెసీఆర్ ఆప్తుడిగా ఉన్న కేశవరావుకు పార్టీలో పార్టీ సమావేశాల్లో టిఆర్ఎస్ సముచిత స్థానం కల్పిస్తున్నది.
previous post
next post