30.7 C
Hyderabad
April 29, 2024 06: 19 AM
Slider ప్రత్యేకం

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

#trsmps

పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఆ త‌ర్వాత ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యం మొద‌లైంది. కానీ ఆ స‌మ‌యంలో టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో టీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు.

Related posts

ఆస్టేలియాలో హిందూ దేవాలయంపై మరో సారి దాడి

Satyam NEWS

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

పర్యాటక ప్రాంతంగా జాఫర్ బావి

Bhavani

Leave a Comment