39.2 C
Hyderabad
May 3, 2024 11: 27 AM
Slider కరీంనగర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కరీంనగర్ టీఆర్ఎస్ శ్రేణుల సమావేశం

#ministergangula

డిసెంబర్ పదోతారీఖున నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ సిద్దమౌతుంది. అందులో బాగంగా ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఈ రోజు కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించారు. కరీంనగర్ నగర పాలక, కొత్తపల్లి పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్, ఛైర్మన్, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు, మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థికి పార్టీలొ ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ ఏక నిర్ణయంతో మద్దతు తెలపాల్సిందిగా సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాలకవర్గాల సభ్యులు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని మంత్రి ద్వారా అధిష్టానానికి తెలియజేసారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాలకు మంత్రి గంగుల ఎన్నికల ఇంచార్జిగా, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు మంత్రి కొప్పుల ఈశ్వరు బాధ్యులుగా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, ఇరు పాలకవర్గాల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

దాసుకి ఊస్టింగ్… ప్రసాదుకి పోస్టింగ్

Satyam NEWS

శాస్త్రోక్తంగా బాలాలయ మహాసంప్రోక్షణ

Sub Editor

రోడ్డు ప్రమాదాల పట్ల ట్రాఫిక్ పోలీసుల అవగాహన చర్యలు

Satyam NEWS

Leave a Comment