28.7 C
Hyderabad
April 26, 2024 09: 47 AM
Slider ముఖ్యంశాలు

హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ఎన్నిక కమిషనర్

#Nimmagadda Rameshkumar

తనను కాదని పదవిలో కొనసాగుతున్న డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై ఉన్న కోపాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీర్చుకుంటున్నారా?

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా విడుదల చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్‌కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. 

వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు.

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ  ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు.

Related posts

సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని పాకిస్తాన్ పంపుతాం : బండి సంజయ్

Satyam NEWS

మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం: అమిత్ షా

Satyam NEWS

బిజెపి కొమరంభీమ్ జిల్లా మీడియా ఇన్ చార్జిగా ఖండ్రే

Satyam NEWS

Leave a Comment