28.7 C
Hyderabad
April 26, 2024 10: 33 AM
Slider ప్రత్యేకం

తిరుపతి వేంకటేశ్వరుడి సొమ్ము తరలిస్తున్నారు

Tirumala

తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి సొమ్ముకు అధిక వడ్డీ వస్తుందన్న పేరుతో ప్రభుత్వ బాండ్లకు తరలిస్తున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు తీర్మానించిన విషయం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులలో డిపాజిట్ల పై వడ్డీ రేటు తగ్గించింది. ఈ కారణం చూపి అంత కన్నా ఎక్కువ వడ్డీ వస్తుందనే కారణంగో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను టీటీడీ కొనుగోలు చేసే ఆలోచన చేయడం దారుణమని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానం ఆయన బయట పెట్టారు.

1.TTD board resolution No 140″ dated 28-08-2020 Approved to invest in Central government (OR) State government securities, so as to avail the “interest” advantage..

2.TTD rule 80 of G.O Ms No 311,dt 9-4-1990 & TTD finance committee meeting on13-08-2020

వెంకన్న సొమ్ముతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సోకులా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ అలాంటిది ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చకండి అంటూ ఆయన నిశిత విమర్శలు చేశారు.

శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రం. వాటి జోలికి వెళ్ళకండి టిటిడి తీసుకున్న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు పై మఠాధిపతులు పీఠాధిపతులు ప్రశ్నించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

టిటిడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ధర్మకర్తల మండలికి, ఏ ఐఏఎస్ అధికారులకు రాని దుర్మార్గపు ఆలోచనలు, అనాలోచిత నిర్ణయాలు నేటి ధర్మకర్తల మండలికి ఐఏఎస్ అధికారులకు ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

శ్రీవారి నిధులు ఇప్పటివరకు జాతీయం చేసిన బ్యాంకులలో పెడుతున్నారని కొంత తక్కువ వడ్డీ ఉన్నా డిపాజిట్లు చేసి ఆయా బ్యాంకుల ద్వారా పరోక్షంగా “లడ్డూ కౌంటర్లలో” “పరకామణిలో” సిబ్బందిని నియమించుకుని వారికి బ్యాంకు ద్వారా జీతాలు ఇప్పిస్తూ టీటీడీ పై ఆర్థిక భారం పడకుండా చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

“వడ్డీ” కన్నా “భద్రత” ముఖ్యమని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి అధికారుల తీరు చూస్తుంటే అధిక వడ్డీ కోసం శ్రీవారి నిధులను “రియల్ ఎస్టేట్” “షేర్ మార్కెట్” లలో కూడా పెడతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం, కుర్చీలను కాపాడుకునేందుకు శ్రీవారి సొమ్ముని ఫణంగా పెడితే శ్రీవారి భక్తునిగా హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరిస్తున్నానని ఆయన తెలిపారు.

Related posts

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

ఎన్నికల కోసమేనా అమిత్ షా కాశ్మీర్ పర్యటన?

Satyam NEWS

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

Leave a Comment