42.2 C
Hyderabad
May 3, 2024 15: 43 PM
Slider సినిమా

‘అన్నగారి విగ్రహంలో మీ భాగస్వామ్యం కావాలి’

#ntr

నందమూరి ఎన్.టి. రామారావు  కీర్తి ఆ చంద్రతారార్కం ఉండాలనే సంకల్పతోనే మా కమిటీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను తలపెట్టిందని,  ఎన్ .టి .ఆర్ ప్రసంగాలను రెండు సంపుటాలుగా , అన్నగారి వ్యక్తిత్వం పై శకపురుషుడు అన్న ప్రత్యేక సంచికను వెలువరించామని టి .డి .జనార్దన్ తెలిపారు.

ఎన్ .టి .ఆర్ .శతాబ్ది  వేడుకలను లాస్ ఏంజిల్స్ లో అభిమానులు ఏర్పాటుచేశారు . ఎన్ .టి .ఆర్.సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ చైర్మన్ టి .డి. జనార్దన్ మాట్లాడుతూ , ఇప్పటివరకు ఎంతో  మంది శతాబ్ది ఉత్సవాలు జరిగాయి , కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఘనంగా ఎవరికీ జరగలేదని చెప్పవచ్చు . ఆ క్రెడిట్  అన్నగారికి మాత్రమే దక్కినదని జనార్దన్ చెప్పారు .

ఎన్ .టి .ఆర్ . సినిమా జీవిత తొలి రోజుల్లోనే ప్రజల కష్టాలు , కన్నీళ్లు తుడిచారని, ప్రజా సేవే పరమార్ధంగా భావించారని,  ఆసేవా గుణమే అన్నగారిని రాజకీయాల్లోనకి  వచ్చేలా చేసిందని జనార్దన్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం ప్రజల కోసమే శ్రమించారని , ఆయన కుటుంబం కన్నా ప్రజలే మిన్నగా భావించిన మానవాతావాదని ఆయన అన్నారు. హైద్రాబాద్ లో అన్నగారి 100 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలనే ఉద్దేశ్యంతోనే అమెరికా  వచ్చానని  , ఆ మహత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని జనార్దన్ పిలుపునిచ్చారు.

ఎన్ .టి .ఆర్ .శతాబ్ది వేడుకల్లో భాగంగా లాస్ ఏంజిల్ లో వున్న తెలుగు బాల బాలికలు ప్రదర్శించిన నృత్యాలు ఎంతో బాగున్నాయని , తెలుగు సంస్కృతీ , సంప్రదాయాలు మర్చిపోకుండా మీ పిల్లలకు వాటి ప్రాముఖ్యం తెలియజేయడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలుగు కుటుంబాలను  జనార్దన్ అభినందించారు. ఎన్ .టి .ఆర్ . శతాబ్ది వేడుకలకు తెలుగు కుటుంబాలు తరలి వచ్చాయి. వెయ్యి  మంది సామర్ధ్యం వున్న ఆడిటోరియం లో 1350 మంది రావడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కార్యక్రమానికి ముందు శరత్ కామినేని ఇంట్లో కొలువైన అన్నగారి విగ్రహాన్ని దర్శించిన   జనార్దన్, అట్లూరి అశ్విన్, పుష్ప గుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు.

Related posts

క్రేన్ సంస్థల అధినేతగా లక్ష్మీకాంతరావుకు పట్టాభిషేకం

Satyam NEWS

బూతు బొమ్మలు తొలగిస్తున్నారు, సంతోషం

Satyam NEWS

రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపేయాలి

Satyam NEWS

Leave a Comment