32.2 C
Hyderabad
May 1, 2024 23: 27 PM
Slider రంగారెడ్డి

ప్రొటెస్టు: టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా తుక్కుగూడాలో బంద్

tukkuguda

తుక్కుగూడ  మున్సిపాలిటీలో అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ వైఖరికి నిరసనగా నేడు బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బంద్ జరుగుతున్నది.  ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  ప్రజాస్వామ్యబద్ధంగా  గెలిచినా కూడా  టిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ  విలువలను  తుంగలో తొక్కిందని బీజేపీ ఆరోపించింది.

ప్రజాస్వామ్యానికి  వ్యతిరేకంగా మున్సిపాలిటీ చైర్మన్ ని  ఎన్నుకున్న టీఆర్ఎస్ పార్టీ వైఖరిని బీజేపీ ఖండించింది. బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకత్వం పిలుపు మేరకు తుక్కుగూడ మున్సిపాలిటీ  బంద్ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, బొక్క నర్సింహారెడ్డి, వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తుక్కుగుడా మున్సిపాలిటీ  కౌన్సిలర్స్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి నెట్టేసిన కసాయి కొడుకు

Satyam NEWS

కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎంపీ?

Bhavani

హరితహారం నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment