30.3 C
Hyderabad
March 15, 2025 09: 40 AM
Slider నిజామాబాద్

చేపల వేటకు వెళ్లిన తండ్రి కొడుకులు ఇక రాలేదు

#Father and son

ఎండాకాలం కావడంతో చేపలు పట్టడానికి వెళ్లారు ఆ తండ్రి కొడుకులు. ఇక తిరిగి రాలేదు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రమాద వశాత్తు బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగపూర్ శివారులో కామారెడ్డి పెద్ద చెరువుకు అనుకుని ఉన్న బావిలో దేవునిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు మృతి చెందారు.

దేవునిపల్లి గ్రామంలోని దత్తాత్రేయ గుడి సమీపంలో నివసిస్తున్న 32 ఏళ్ల షేక్ మీర తన 6 సంవత్సరాల కొడుకు మౌలానాతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి లింగపూర్ శివారులోని బావిలో పడి మృతి చెందారు. మీర సోదరుడు రఫిక్ తెలిపిన వివరాల ప్రకారం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రి కొడుకులు వల పట్టుకుని చేపలు పెట్టడానికి బయలు దేరారు.

నిన్న మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో బయటకు వెళ్లిన ఇద్దరు ఇంటికి తిరిగి రాలేదు. ఈ రోజు ఉదయం నుంచి వెతుకుతుండగా బావిలో ఇద్దరు శవాలై తేలారు. అయితే మీరకు ఫిట్స్ వస్తుందని, ఈదురు గాలులతో వర్షం పడినప్పుడు ఫిట్స్ వచ్చి బావిలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అతని కాపాడబోయి కొడుకు కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతునికి భార్య  సబియా బేగం, ఇద్దరు కుమారులు 11 సంవత్సరాల 04 సంవత్సరాల ఫైజాన్  ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యపు చేస్తున్నారు.

Related posts

నీలోఫర్‌ హాస్పిటల్‌ లో మౌలిక వసతులకు ఏడీపీ సాయం

Satyam NEWS

ఆల్ ఆర్ ఈక్వల్ :మంత్రి కారు తనిఖీ చేసిన పోలీస్ లు

Satyam NEWS

ఘనంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment