ఇంజిన్‌లో లోపం రావడంతో ముంబై–హైదరాబాద్ విమానం తిరిగి వెనక్కి వచ్చింది.గురువారం వేకువజామున ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రయాణీకులతో ముంబై విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజిన్ పనిచేయని విషయం గమనించి పైలెట్ అప్రమత్తమయ్యాడు.
అధికారుల సమాచారమందించి ఆదేశాల మేరకు తిరిగి విమానాన్ని అదే విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపా రు. వారిని వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు వెల్లడించారు