35.2 C
Hyderabad
May 29, 2023 20: 21 PM
Slider సినిమా

ఘనంగా బలగం టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు

#ugadiawards

తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన “బలగం” చిత్ర యూనిట్ ను ఉగాది నంది  సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని ప్రసాద్, ప్రవీణ నాయుడు మరియు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురిని ఉగాది నంది పురస్కారంతో సత్కరించారు.

ఉగాది రోజు టీం మొత్తాన్ని ఘనంగా సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు సాంకేతిక నిపుణులు కృతఙ్ఞతలు తెలియజేసారు. “బలగం” లాంటి చిత్రాలు మరిన్ని రావాలని ఇదొక దృశ్యకావ్యం అని ఆర్ నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు. మంచి సాంప్రదాయానికి తెరదీసిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వర్మ పాకలపాటి, ఉపాధ్యక్షులు మిమిక్రీ రమేష్ కి అభినందనలు తెలిపి… త్వరలో “సింహ” పేరుతొ ప్తభుత్వం తరపున పురస్కారాలు ఇచ్చే యోచనలో ముఖ్యమంత్రి కే సి ఆర్ వున్నారని తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం ప్రకటించారు.

Related posts

రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టండి

Murali Krishna

రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్

Bhavani

18 రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్ష

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!