33.7 C
Hyderabad
April 30, 2024 00: 10 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు

#srisailam

నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కైలాస వాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. అదే విధంగా మహాదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ దేవి దర్శనమిచ్చారు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు నిర్వహించగా ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ, శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీ హోమం జరిగాయి. కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లు, మహా దుర్గా అలంకారంలో అమ్మవారి ఉత్సవమూర్తులను అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో రంగ రంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది. రాత్రి శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం జరిగింది.

Related posts

సేవ్ ట్రీ: బిచ్కుందలో వాటరింగ్ డే

Satyam NEWS

వైజాగ్ గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు

Satyam NEWS

వర్ష సూచన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment