నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. స్వామి అమ్మవార్లకు వైభవంగా ప్రభోత్సవం, నంది వాహన సేవ జరిగాయి. ఉగాది ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ, శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్లకు వైభవంగా ప్రభోత్సవం నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను నంది వాహనం పై అధిరోహింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ దేవి మహా సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అనంతరం మేళ తాళాలతో కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శివదీక్షా శిబిరాల వద్ద వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చూసి భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
previous post
next post