29.7 C
Hyderabad
April 29, 2024 08: 30 AM
Slider జాతీయం

ఆస్క్ ఆధార్: UIDAI ప్రవేశపెట్టిన కొత్త సర్వీసు

aadhaar

ఆస్క్ ఆధార్  పేరుతో UIDAI మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను ఈ ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకుని పరిష్కరించుకోవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది.

ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి సమస్యను వివరించవచ్చు. ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఎలాంటి అంశాలనైనా ప్రస్తావించవచ్చు. ఆధార్‌ కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది.

ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా ఇదే విండోలో చూడ వచ్చు. ఇప్పటి వరకు 125 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆధార్ కార్డు ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగించడం పెరిగిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఆధార్ సర్వీస్ ప్రారంభించిన నాటి నుంచి 37 వేల కోట్ల సార్లు ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరిగినట్టు లెక్కలున్నాయి. ప్రతీరోజు ఆధార్ ఆథెంటికేషన్ కోసం మూడు కోట్ల రిక్వెస్ట్‌లు UIDAI కు వస్తున్నాయి. ఇప్పటి వరకు 331 కోట్ల ఆధార్ అప్‌డేట్స్ జరిగాయి. ఆధార్ అప్‌డేషన్ కోసం ప్రతీ రోజు 3 నుంచి 4 లక్షల వరకు రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

Related posts

అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల

Satyam NEWS

సావిత్రీబాయి ఫూలేకి సీఎం కేసీఆర్ ఘన నివాళి

Bhavani

కడప జిల్లాలో ఏటీఎం ల దొంగ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment