38.2 C
Hyderabad
April 28, 2024 22: 31 PM
Slider ప్రపంచం

రష్యాతో రాజీ: వెనక్కి తగ్గిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

#waronukraine

రష్యాతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉక్రెయిన్ కు శక్తి సన్నగిల్లినట్లుంది. గత రెండు వారాలుగా రష్యా సేనలతో భీకర యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు రష్యాతో రాజీకి సిద్ధం అయింది. ఇక తాను నాటో సభ్యత్వం కోసం ప్రయత్నించనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. రష్యాతో శాంతి చర్చలకు సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు. తాము కాల్పుల విరమణ చేయాలంటే నాటో సభ్యత్వం కోసం ప్రయత్నించేది లేదని ఉక్రెయిన్ స్పష్టమైన హామీని ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.

ఒక న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. “చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్‌ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు  వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది” అన్నారు.

“ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటూ సభ్యత్వం కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్‌ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్‌ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

అంతేకాదు రష్యా స్వతంత్య్ర రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్‌ రెబల్స్‌ విషయంలోనూ రాజీ పడాలని నిర్ణయించుకున్నట్లు కూడా జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్‌స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది.

Related posts

ఖజానా కార్యాలయం ప్రారంభించిన మంత్రి బుగ్గన

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

Satyam NEWS

మాచర్లలో చెడ్డి గ్యాంగ్ హాల్ చల్

Bhavani

Leave a Comment