తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయిన శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కందూరీ సుధాకర్ తెలిపారు.
నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఉమా మహేశ్వర ఆలయం లో భక్తులకు దర్శనం నిలిపి వేసినట్లు ఆయన తెలిపారు. అందువల్ల భక్తులు సహకరించి ఆలయం దర్శనం వాయిదా వేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అదేవిధంగా ఉమామహేశ్వర ఆలయంలో నిత్య పూజలను మాత్రం ఆలయ అర్చకులు యథావిధిగా నిర్వహిస్తారు.