కడప జిల్లా రాజంపేట నందలూరు మండల కేంద్రం అరవపల్లె రైల్వే గ్రంథాలయంను సౌత్ సెంట్రల్ రైల్వే మెడికల్ డిపార్ట్ మెంట్ హెల్త్ యూనిట్ కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డుగా మార్చింది. నేటి నుంచి ఈ వార్డులో కరోనా అనుమానితులను ఉంచుతారు.
వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వివిధ రకాల ట్రైన్ లల్లో ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతివేగంగా విస్తరిస్తూ ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కరోనా వ్యాపించ కుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది.
రైళ్ల లో ప్రయాణించే అనుమానిత కరోనా లక్షణాలు కలిగిన ప్రయాణికులను గుర్తిస్తే వారిని గుంతకల్ రైల్వే డివిజనల్ మెడికల్ డిపార్ట్ మెంట్ హెల్త్ యూనిట్ ఆధ్వర్యంలో నందలూరు రైల్వే ఫ్లాట్ ఫామ్ పక్కన ఉన్న రైల్వే గ్రంధాలయంలో కోవిడ్19 ఐసోలాషన్ హాల్ ను ఏర్పాటు చేశారు. వారిని అక్కడికి తరలిస్తారు. కరోనా అనుమానితుల కోసం బెడ్లు తదితర సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అనుమానం ఉన్న వారిని కడప రిమ్స్ కు తరలించనున్నారు.