40.2 C
Hyderabad
May 2, 2024 17: 24 PM
Slider ముఖ్యంశాలు

సహకరించని టీడీపీ

#cpm

ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానాల్లో పీడీఎఫ్ స‌హ‌కారంతోనే టీడీపీ మూడు చోట్ల గెలుపొందింది. అయితే టీచ‌ర్స్ ఎమ్మెల్సీలో మాత్రం ఒప్పందం ప్ర‌కారం టీడీపీ ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని సీపీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ప‌ట్ట‌భ‌ద్రుల‌ స్థానాల్లో మాత్రం త‌మ ఓట్లు వేయించుకుని గెలుపొంది, టీచ‌ర్స్ స్థానాల్లో త‌మ విజ‌యానికి క‌నీస ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేద‌న్న‌ది ఆ పార్టీ ఆక్రోశం. ఈ మేర‌కు అధికారికంగానే సీపీఎం త‌న నిర‌స‌న‌ను బ‌హిర్గ‌తం చేసింది. సీపీఎం రాష్ట్ర‌కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ స‌మావేశం ఆమోదించిన తీర్మానంలో ప‌లు కీల‌క అంశాలున్నాయి. మూడు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విద్యావంతులు ఇచ్చిన తీర్పును సీపీఎం స్వాగ‌తించింది. ప్రభుత్వ తీరుకు ప్రతిఘటనే పట్టభద్రుల తాజా తీర్పని, ప్రభుత్వ విధానాలకు నిరసనగానూ, వాటికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమాల కొనసాగింపుగానే పట్టభద్రుల ఓటును వినియోగించారని తీర్మానంలో పేర్కొంది. కానీ ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమస్యలపై నిరంతరం, నిస్వార్థంతో పనిచేస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరమని సీపీఎం ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఉపాధ్యాయ స్థానాల్లో వైసీపీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ ఆసక్తి చూపకపోవడం రాజకీయ వైఫల్యంగా భావిస్తున్న‌ట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు త‌మ‌ను మోస‌గించా ర‌ని సీపీఎం నేరుగా చెప్పింద‌నేందుకు ఈ తీర్మాన‌మే నిద‌ర్శ‌నం. మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు కేవ‌లం పీడీఎఫ్ అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుతారుల రెండో ప్రాధాన్యం ఓట్ల‌తో గెట్టెక్కార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. త‌మ‌తో ఓట్లు వేయించుకున్నారే త‌ప్ప‌, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ క‌నీస స‌హ‌కారం కూడా అందించ‌లేద‌ని సీపీఎం నేరుగా విమ‌ర్శిస్తోంది.

Related posts

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతాం

Satyam NEWS

జర్నలిస్టు లకు న్యాయం చేస్తా: ఎమ్మెల్యే  మేడా హామీ

Satyam NEWS

3 రెట్లు ఎక్కువగా పిల్లలకు కరోనా

Sub Editor

Leave a Comment