39.2 C
Hyderabad
May 3, 2024 15: 00 PM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి

#Kaleru Venkatesh

బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబర్ పేట నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో నూతన డ్రైనేజ్ లైన్లు, మంచినీటి పైప్లైన్లు, నూతన సిసి రోడ్లు, వేయడం జరిగిందని అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో సుమారుగా 11 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులకు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ లో పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రేమ్ నగర్ లో ఇప్పటికే నూతన డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు 22 కోట్ల రూపాయలతో నాలా వెడల్పు కార్యక్రమాన్ని చెయ్యడం జరుగుతుందని ప్రేమ్ నగర్ లో నూతన సిసి రోడ్డు పనులు జరుగుతున్నయని తెలిపారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కార్పొరేటర్ గా నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో అంబర్ పేట డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగందన్నారు. ప్రేమ్ నగర్ లో కోట్ల రూపాయల వ్యయంతో మంచినీటి, డ్రైనేజ్ పైప్లైన్లు నూతన సిసి రోడ్లు నూతన వీధి దీపాలు చేయించడం జరిగిందని తెలిపారు. ప్రేమ్ నగర్ లో 11 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు మైనార్టీ నాయకులు స్థానిక బస్తీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

వనపర్తి జిల్లాలో అనుమానాస్పదంగా నలుగురు మృతి

Satyam NEWS

రిటైర్డ్ ఉద్యోగుల సంఘo సేవలు అభినందనీయం

Bhavani

ట్రాజెడీ:వడోదరలో రోడ్డు ప్రమాదం 12 మంది మృతి

Satyam NEWS

Leave a Comment