29.7 C
Hyderabad
May 2, 2024 03: 29 AM
Slider నిజామాబాద్

సమయపాలన పాటించని ప్రభుత్వ టీచర్లు: పట్టించుకోని విద్యాధికారులు

కామారెడ్డి జిల్లా బికనూర్ మండలo, తిప్పాపూర్ గ్రామం లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రభుత్వ టీచర్లు పాఠశాలకు సమయానికి రావట్లేదని బి డి ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. ప్రవీణ్ ఆరోపించారు. అడిగే వారు ఎవరు లేరు అని వాళ్ళ ఇష్టానుసారంగా పాఠశాలకు వస్తున్నారన్నారు. విద్య పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి వ్యవహరించటం సరికాదన్నారు .

వేలాది రు.ల ప్రభుత్వ వేతనం తీసుకుంటూ సమయానికి రాకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు సరైన విద్యను అందించడంలో జాప్యం జరుగుతదన్నారు. ఈ విషయం పై విద్యార్థి సంఘాలు ప్రశ్నించగా వాహనాలు టైం కు దొరకట్లేదు అంటూ సాకు తో సర్ది చెప్పుకొని స్కూలుకు ఆలస్యంగా వస్తున్నారన్నారు. పోస్టింగ్ ఎక్కడ ఉంటే అక్కడ దగ్గర్లో నివాసం ఉండాల్సిన హెడ్మాస్టర్ శైలజ హైదరాబాద్ నుండి వస్తూ.. స్కూల్ కి ఆలస్యంగా వస్తుందన్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి వలన విద్యార్థులు విలువైన సమయాన్ని జ్ఞానాన్ని కోల్పోతున్నారన్నారు.

పాఠశాల సమయంలో ఫోన్లు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ… విద్యార్థులకు సరైన విద్యను అందించడంలో విఫలమయ్యారన్నారు. సొంత పనులు ఉన్నాయని పై అధికారుల దగ్గర సర్ది చెప్పుకుంటూ…సెలవులు పెడుతూ కాలం ఏళ్ళదీస్తున్నారన్నారు. ఈ విషయలాపై పై అధికారులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు.

విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాల్సిన టీచర్లు సమయపాలన పాటించకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక బాధ్యత గల వృత్తిలో ఉంటూ సమయపాలనకు రాకపోవడం వలన విద్యార్థులు విలువైన విద్యకు ఎంతో దూరమవుతారన్నారు. సమయపాలన పాటించని ప్రభుత్వ టీచర్లపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు ఎంతో విలువైన విద్యను నష్టపోతారన్నారు. ఈ నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. సమయపాలన పాటించని టీచర్లపై చర్యలు తీసుకోనీ , విద్యార్థులకు మంచి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు.

జీ. లాలయ్య, సత్యం న్యూస్ జుక్కల్

Related posts

వల్కనో ఎఫెక్ట్ : ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బ్లాస్ట్ లావా తో ఇబ్బంది

Satyam NEWS

పాకిస్తాన్ బయటపడేందుకు మార్గం కూడా ఉన్నది….

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు మూసివేత

Satyam NEWS

Leave a Comment