38.2 C
Hyderabad
May 3, 2024 19: 52 PM
Slider సినిమా

ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చెబుతూ…

#childartist

సర్ప్రైజ్ చేస్తున్న చిచ్చరపిడుగు బేబీ శ్రీసోహాని నాథ్

కరోనా టైమ్ లో ఈ చిన్నారిపై ఏదో సరదాగా తీసిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పలువురు ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేయడం అందుకు కారణం. “దానవీరశూరకర్ణ”లో 11 నిమిషాల నిడివి గల హిస్టారికల్ డైలాగ్స్… దుర్యోధనుడి వేషంలో ఈ చిచ్చరపిడుగు చెప్పిన తీరు చూసి ముక్కున వేలు వేసుకోనివారు లేరు. ప్రస్తుతం ఓ సీరియల్ చేస్తూ… సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న ఈ ఆరేళ్ల “వండర్ కిడ్” పేరు “శ్రీసోహానినాథ్”.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు… మూడేళ్ళ వయసులోనే ఈ చిన్నారి తన అసాధారణమైన ప్రతిభను చూపడం ప్రారంభించింది. తండ్రి (బద్రి) కూడా స్వతహాగా జర్నలిస్ట్ కమ్ ఆర్టిస్ట్ అయ్యుండడంతో… తన బిడ్డలోని అనితర సాధ్యమైన స్కిల్స్ పసిగట్టి ప్రోత్సహించారు. దాంతో శ్రీసోహాని నాథ్ ప్రతిభ ప్రపంచానికి త్వరగా పరిచయమయ్యింది. దేశవిదేశాల్లో ప్రాచుర్యం కలిగి… లక్షలాది వీక్షకుల్ని కలిగిన “ఆనందోబ్రహ్మ” అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడంతో సోహాని పాపులారిటీ ప్రపంచవ్యాప్తమైంది. దాంతో ప్రతిభకు పట్టం కట్టే కళారంగం సహజంగానే సోహానిని అక్కున చేర్చుకుంది!!

ఎన్ని పేజీల డైలాగులైనా సరే సింగిల్ టేక్ లో ఓకే చేసే సోహాని ప్రస్తుతం “ఊహలు గుసాగుసలాడే” సీరియల్ లో చేస్తూ బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూనే… సంచలన దర్శకుడు తేజ రూపొందిస్తున్న “అహింస” చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ సొంతం చేసుకుంది. అంతే కాదు “9 అవర్స్” అనే వెబ్ సిరీస్ తో ఓటిటి ప్రియుల్ని కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఒక్క తెలుగులోనే కాదు… ఏ భాషనైనా సరే నిమిషాల్లో ఆకళింపు చేసుకుని అలవోకగా డైలాగ్స్ చెప్పడం ఈ సిసింద్రీ ప్రత్యేకత. సన్నివేశానికి తగ్గట్టు.. పాత్ర పరిధి మేరకు అత్యద్భుతంగా హావభావాలు పలికేంచే సోహాని… గ్లిజరిన్ లేకుండానే ట్రాజడి సీన్స్ రక్తి కట్టించి శభాష్ అనిపించుకుంటుంది!!

ఈ ఆరేళ్ల చిచ్చర పిడుగు స్వస్థలం అనకాపల్లి అయినప్పటికీ… సినిమాలు-సీరియల్స్-ఓటిటి మేకర్స్ కు అందుబాటులో ఉండేందుకు… ఆమె పేరెంట్స్ హైద్రాబాద్ షిఫ్ట్ అయి… మూసాపేట-ఆంజనేయనగర్ లో నివాసముంటున్నారు. చదువులోనూ అద్వితీయంగా రాణిస్తున్న ఈ “ఏకసంథాగ్రాహి”కి అవకాశం ఇవ్వాలనుకునేవారు 91773 36695 నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు!!

Related posts

ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కూలీల వినతి

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ ఘటనపై నిర్మల్ కాంగ్రెస్ నిరసన

Satyam NEWS

ఓటరు గుర్తింపు కార్డులు వచ్చాయి

Murali Krishna

Leave a Comment