26.7 C
Hyderabad
May 3, 2024 10: 07 AM
Slider నల్గొండ

హుజూర్‌నగర్ లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలి

#urbanhealthcenter

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో ఎల్ ఆర్ నెం.206/మెప్మా/బస్తీ దవాఖానా/2018 ప్రకారం స్లమ్ ఏరియాలో 5 వేల నుండి10 వేల జనాభా ఉంటే ఖచ్చితంగా బస్తీ దవాఖానా(అర్బన్ హెల్త్ కేర్ సెంటర్) ఏర్పాటు చేయాలని ఉందని మహ్మద్ అజీజ్ పాషా అన్నారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  మండల పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయని,చుట్టు ప్రక్కల గ్రామాల వారు,పట్టణంలో ఉన్న వారు రూరల్ గ్రామాల నుండి లింగగిరి పి.హెచ్.సి. కి వెళ్లటానికి గర్భిణీ స్త్రీలు వైద్య చికిత్సలు చేయించుకోవడానికి సుమారు 10 కిలోమీటర్ల నుండి15 కిలోమీటర్ల మేర దూర భార ప్రయాణం అవుతుందని, అలాగే ప్రతి నెలా రెండు సార్లు గర్భిణీ స్త్రీలు చెకప్ కు వెళ్ళటానికి ప్రయాణ భారం ఆర్థిక భారం పడుతుందని అన్నారు.

నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ పట్టణంలో సుమారు 60 వేల పైచిలుకు జనాభా  మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉన్నాయని,ఆవాస గ్రామాలకు హుజూర్ నగర్ రెవిన్యూ డివిజన్ కేంద్రం ఇవి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోవిందాపురం,హరిజనవాడ, అంబేద్కర్ కాలేని,మాధవరాయని గూడెం, ఎన్టీఆర్ నగర్,చింతల బజారులు ఇలా స్లమ్ ఈ ఏరియాలో ఉన్నావారు సుమారు14 వేల పైచిలుకు జనాభా ఉన్నదని అన్నారు.

పేద,మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అందులో అందుబాటులో ఉంటూ సుమారు 40 రకాల డయాగ్నస్టిక్ టెస్టులూ ఉచితంగా చేయడానికి ఉపయోగపడుతుందని,అదే ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి టెస్టులు, ట్రీట్మెంట్ కి హాస్పిటల్ కు వెళ్లాలంటే వేల రూపాయల ఖర్చు ఆర్థిక భారం ప్రజలపై పడుతుందని అజీజ్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వెంటనే  హుజూర్ నగర్ పట్టణంలో కూడా బస్తీ దవాఖాన (అర్బన్ హెల్త్ సెంటర్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అజీజ్ పాషా కోరుతూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహనరావు కి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు జానీ నవాబ్,షేక్.మజీద్, రసూల్,షేక్ భాష,సలీమ్ బాబా,మీరా, మోహిన్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

విక్రమ సింహపురి వర్సిటీకి ఎన్ఎస్ఎస్ అవార్డు

Satyam NEWS

కన్నవారి చెంతకు చిన్నారులు….

Satyam NEWS

డొంకతిరుగుడు అప్పులకు లెక్క చెప్పని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment