32.7 C
Hyderabad
April 27, 2024 02: 59 AM
Slider ప్రత్యేకం

కన్నవారి చెంతకు చిన్నారులు….

#kids

నాటకీయ పరిణామంగా బాబాయ్ యవ్వారం… పోలీసు స్టేషన్ లోనే చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది..!

విజయనగరం లో కలకలం సృష్టించిన చిన్నారుల అంశాన్ని మూడు గంటలలో వన్ టౌన్ పోలీసులు చేధించారు. అటు మీడియా..ఇటు సోషల్ మీడియా పుణ్యమా..ఎట్టకేలకు కన్నవారి చెంతకు చిన్నారులు చేరారు. ఈ విషయంలో వన్ పోలీసులు  క్విక్ రియాక్ట్ ను మెచ్చుకోకతప్పదు.

వివరాల్లోకి వెళితే..27 వ తేదీ ఆదివారం సాయంత్రం..” ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఇద్దరు చిన్నారులు కన్నవారి కోసం ఎదురు చూస్తున్నారు “అంటూ వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందిన వెంటనే హెచ్.సీ రామారావు సీఐ వెంకటరావు ఆదేశాల మేరకు హుటాహుటిన ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లి చిన్నారులను తీసుకుని స్టేషన్ కు రావడం…విషయం సత్యం న్యూస్. నెట్ కు తెలియడంతో పాటు ఏబీఎన్ కు కూడా తెలిసింది.

ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఆ చిన్నారుల కన్నవారి బంధువులు విజయనగరం లంకాపట్నం లో ఉండి ఆ విషయం తెలుసుకుని స్టేషన్ కు రావడం..అప్పుడే చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ ఆధీనంలో పోలీసులు అప్పగించడం…అదే సమయంలో చిన్నారుల ఆందోళనలను “సత్యం న్యూస్. నెట్.’ లో రావడంతో… ఎట్టకేలకు కన్నవారితో పోలీసులు మాట్లాడం…వాళ్ళు వైజాగ్ లో ఉండటంతో వెంటనే విజయనగరం వన్ టౌన్ స్టేషన్ రావడం జరిగింది.

అయితే… చిన్నారుల బాబాయ్ కూడా విషయం తెలుసుకుని స్టేషన్ కు వచ్చారు. కాగా.. స్టేషన్ లో చిన్నారుల బాబాయ్ చెబుతున్న మాటలలో పొంతన లేకపోవడంతో అటు చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది ..అతగాడిని స్టేషన్ లోనే ఉంచి పోలీసుల ముందే విచారిస్తున్నారు. అయితే పిల్లలను బస్సు ఎక్కించి..ఆ బస్సు వెనకాల తాను వెళ్లుతున్నానని..అంతలో పిల్లలు స్టేషన్ లో ఉన్నారని తెలియడంతో సరాసరి స్టేషన్ కు వచ్చానని బాబాయ్ చెబుతున్నాడు.

మరి అసలు విషయం ఏమిటో…పోలీసులే తేల్చాలి.ఏదైతేనేం మూడు గంటల పాటు చిన్నారులు అటు పోలీసులను ఇటు మీడియా ను ఆందోళన కు గురి చేసినా..చివరకు కన్నవారి చెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

గోవాలో ‘క్రాక్’ మూవీ లాస్ట్ షెడ్యూల్‌

Sub Editor

యుద్ధ ప్రాతిపదికన అంబర్ పేట్ డివిజన్ అభివృద్ధి

Satyam NEWS

షర్మిల అరెస్టు పై భిన్నాభిప్రాయాలు

Satyam NEWS

Leave a Comment