25.2 C
Hyderabad
May 8, 2024 08: 14 AM
Slider ప్రత్యేకం

డొంకతిరుగుడు అప్పులకు లెక్క చెప్పని జగన్ ప్రభుత్వం

#MPRaghuramakrishnamRaju

రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల 30 వేల కోట్లు.. పార్లమెంట్ లో చెప్పింది ఒకటి… సాక్షి దినపత్రికలో రాసింది మరొకటి

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలుపుకొని ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏపీ అప్పుల గురించి పార్లమెంట్లో చెప్పింది ఒకటైతే, సాక్షి దినపత్రిక రాసింది మరొకటి అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలు మూడు లక్షల 98 వేల కోట్ల రూపాయలను పేర్కొనడం జరిగిందని, అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పొందిన రుణాల గురించి ప్రస్తావించలేదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మార్చి 28వ తేదీ తాను ప్రధానమంత్రికి రాసిన లేఖలో పొందుపరిచిన… స్టేట్ పబ్లిక్ డేట్ ప్రకారం, 2022 , 23వ ఆర్థిక వార్షిక సంవత్సర, ప్రభుత్వ బడ్జెట్ వ్యాల్యూమ్ అరు, కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 4 లక్షల 13 వేల కోట్ల రూపాయలని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మూడు లక్షల 98 వేల కోట్లు గా పార్లమెంటులో  పేర్కొన్న దానికి, గత ఏడాది అప్పులు చేసి కూడా లెక్కలు చూపించకుండా ఉన్న మొత్తం అప్పులు నాలుగు లక్షల 13వేల కోట్ల రూపాయలని వెల్లడించారు. ఇక కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులు 1 లక్ష 38 వేల కోట్ల రూపాయలని, ఇది కాక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరిట పదివేల కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందిందన్నారు.

ప్రభుత్వం నాన్ గ్యారెంటీ తో, ఇతర కార్పొరేషన్లు పొందిన అప్పు 87 వేల కోట్ల రూపాయలుగా రఘురామకృష్ణంరాజు వివరించారు.. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం లక్ష 50వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించవలసి ఉన్నది అన్నారు.  గత ఏడాది మార్చి నాటికి 7 లక్షల 98 వేల కోట్ల పైచిలుకు అప్పులుంటే, ఇటీవల 38 వేల కోట్ల రూపాయలను అప్పులుగా ఎత్తారని గుర్తు చేశారు. ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మద్యం బాండ్ల రూపంలో సేకరిస్తే, 30 వేల కోట్ల రూపాయలు ఆర్బిఐ నుంచి  రుణంగా పొందారన్నారు.

అప్పుచేసి పప్పుకూడు సినిమా లో సి ఎస్ ఆర్ గారి తరహాలో తమ ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉన్నదని అపహాస్యం చేశారు. అప్పుల గురించి దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు, రఘురామకృష్ణం రాజు చెప్పేది అంతా తప్పని వాలంటీర్ల కరపత్రం సాక్షి దినపత్రిక ను పట్టుకొని, వాలంటీర్లు చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధమని అన్నారు. దుష్ట చతుష్యం అలాగ, ఇలాగా అంటున్నారని వారు చెప్పేది అంతా తప్పు బూతు అని, రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఢిల్లీలో చర్చకు ఎక్కడైనా తాను సిద్ధమేనని, ఎవరు వస్తారో రావాలని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.

బ్యాంకర్లు, సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకోవాలి

కార్పొరేషన్ల పేరిట అప్పులు చేయడం తప్పని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆర్బిఐ ఇప్పటికే ఆ విషయాన్ని తన ఉత్తర్వులలో పేర్కొన్నదని గుర్తు చేశారు. ఆర్బిఐ మాస్టర్ సర్కులర్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసిందని రఘురామ కృష్ణంరాజు, ప్రధానమంత్రి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఆర్.బి.ఐ నిబంధనలను ఉల్లంఘించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి చైర్మన్ లను, అంతిమంగా లబ్ధిదారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం బ్యాంకర్లకు తెలియదా? అంటూ ప్రశ్నించారు.

Related posts

విజయనగరం ప్రజలంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి

Satyam NEWS

ధరణీ పోర్టల్ ద్వారా 12 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్

Satyam NEWS

జానపద రంగస్థల కళకు ప్రాణం పోసిన మఠంపల్లి వాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య

Satyam NEWS

Leave a Comment