39.2 C
Hyderabad
April 28, 2024 11: 51 AM
Slider సినిమా

‘ఊర్వశివో రాక్షసివో” సందడి

#allushirish

ఖమ్మం నగరంలోని బొమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో  ‘ఊర్వశివో రాక్షసివో” సినిమా హిరో అల్లు సందడి చేశారు. ఈ నెల 4వ తేదిన విడుదల కాబోతున్న సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర హీరో కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, సినిమా విశేషాలను వివరించారు. సినిమాలోని పాటలకు హీరో నృత్యాలు చేసి అలరించారు. డైలాగ్లు చెప్పి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఈ సంధర్బంగా హిరో అల్లు శిరీష్ మాట్లాడుతూ కామెడీతో పాటు మంచి కధతో కూడుకున్న సినిమా అని, అందరిని అలరిస్తుందన్న నమ్మకముందన్నారు. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ హజరుకావడం ఆనందంగా ఉందని, సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ మీటన్ను మళ్ళీ ఖమ్మంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మ విద్యాసంస్థల చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్, లక్ష్మీరాజ్యం, అనూష, ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు పాల్గోన్నారు.

Related posts

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Satyam NEWS

ఆక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్

Satyam NEWS

Leave a Comment