39.2 C
Hyderabad
May 3, 2024 14: 44 PM
Slider విజయనగరం

మనల్ని మనం రక్షించుకోవడానికి వాక్సినేషన్ ఒక్కటే తరుణోపాయం

#coronavaccine

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ఇరు రాష్ట్ర ల సీఎం లు ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకూ పొడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికి వారు తమను రక్షించుకునేందుకు అందుబాటులో కి వచ్చిన వాక్సిన్ వేసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గమని విజయనగరం జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ రాజకుమారీ స్పష్టం చేసారు.

ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సిబ్బందికి వాక్సినేషన్ ను దగ్గరుండీ వేయించారు. అంతకు ముందు రోజే జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ఆదేశాలతో మహిళా సిబ్బంది అందులోనూ గర్భిణీ లకు సంబంధించి కరోనా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై మాట్లాడారు.

తాజాగా మహిళా  పోలీస్ సిబ్బంది అందునా కన్సివ్ అయిన మహిళా ఉద్యోగినిలు వాక్సినేషన్ వేయించుకోవచ్చని ప్రముఖ గైనకాలజిస్ట్ సూచించిన మేరకు ఎస్పీ..తన శాఖలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని రప్పించి… దగ్గరుండీ వాక్సినేషన్ వేయించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఈ సెకండ్ వేవ్ కరోనా లో దాదాపు 200 మంది దాని బారిన పడ్డారన్నారు.కాని ఫస్ట్ ఫేజ్ కరోనా ధాటికి తేరుకోవడంతో ఆ సమయంలో వాక్సినేషన్ రావడంతో ప్రతీ ఒక్కరూ వేసుకున్న కారణం తో కొంత నయం అని ఆయన స్పీ అన్నారు

అందువల్ల వాక్సినేషన్ వేసుకోవడం చాలా ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సూర్యచంద్రరావు ,ఏర్ డీఎస్పీ శేషాద్రి, పీటీసీ డీఎస్పీ ,ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,ఏఆర్ అడ్మిన్ చిరంజీవి, నగర డీఎస్పీ అనిల్ ,ఇతర శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

భూ వివాదంలో దాడికి గురైన దళితుల్ని పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు?

Satyam NEWS

పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

ఘనంగా బొడ్రాయి మహాలక్ష్మి అంశ (శీతలా పరమేశ్వరి) ప్రతిష్ట

Satyam NEWS

Leave a Comment