40.2 C
Hyderabad
April 29, 2024 18: 05 PM
Slider నెల్లూరు

ప్రభుత్వానికే ‘ఆక్సిజన్’ అందిస్తున్న సోనూసూద్

#sonusood

ప్రజలకు కష్టం వస్తే ఎవరికి చెబుతారు? జిల్లా కలెక్టర్ కు చెబుతారు. అయితే విచిత్రంగా జిల్లా కలెక్టర్ కే కష్టం వచ్చింది. ఏం చేస్తాడు? ఆ జిల్లా కలెక్టర్ కు ఏం చేయాలో అర్ధం కాక సినీ నటుడు సోనూ సూద్ దగ్గరకు వెళ్లాడు…. ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజంగానే ఆశ్చర్యం. జిల్లా కలెక్టర్ తన జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరాలి… అదేమిటో గానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ తన జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని సోనూ సూద్ ను కోరారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజెన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ప్రజలకు ముప్పు ఉందని అందువల్ల వారిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సోనూసూద్ కి లేఖ రాసారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూసూద్. 1.5 కోట్ల విలువైన ఆక్సిజెన్ జనరేటర్ ను అందిస్తానని హామీఇచ్చారు. ఈ జనరేటర్ రోజూ 2 టన్నుల ఆక్సిజెన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు రోజుల్లో జిల్లాకు ఆక్సిజెన్ జనరేటర్ రానుంది. దాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టబోతున్నారు….. అర్ధం అయింది కదా? ప్రభుత్వాలే సోనూ సూద్ సాయం కోరుతున్నాయి…. అదీ సంగతి.

Related posts

మూడు రోజులుగా నందలూరు లో త్రాగునీటి ఇక్కట్లు

Satyam NEWS

జై హో స్టాలిన్ : కోవిడ్ ఆస్పత్రులను సందర్శించిన ముఖ్య మంత్రి

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఐటిఐ కాలేజీకి అనుమతి

Satyam NEWS

Leave a Comment