26.7 C
Hyderabad
May 3, 2024 07: 53 AM
Slider సినిమా

అడ్డంకులు ఎదురైనా కొత్త రికార్డులు నెలకొల్పిన వకీల్ సాబ్

#VakeelSaab

పవన్ కల్యాణ్ ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన వారికి మొహం పగిలేలా వకీల్ సాబ్ కలెక్షన్లు వసూలు చేసింది.

వకీల్ సాబ్ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అడ్డంకులు సృష్టించారు. అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలను కరోనా పేరుతో అడ్డుకున్నారు.

బెనిఫిట్ షో పేరుతో అధిక టిక్కెట్ ధరను వసూలు చేసే వెసులు బాటును కూడా పూర్తిగా అడ్డుకున్నారు. కరోనా నిబంధనల పేరుతో ధియేటర్ల వద్ద అభిమానులు గుమికూడకుండా కూడా శతవిధాలా ప్రయత్నించారు.

ఇన్ని అడ్డంకులు దాటుకుని వకీల్ సాబ్ కలెక్షన్ల వర్షం కురిపించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉగాది నాటికి వకీల్ సాబ్ చిత్రం 106 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

ఆ తర్వాత నిన్నటి వరకూ సుమారు 12 కోట్ల రూపాయలు వసూలైనట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు అనధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వం కక్షతో వ్యవహరించి ఉండకపోతే చిత్రం విడుదలైన మొదటి ఐదు రోజుల్లో కనీసం 200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉండేది.

కరోనా పాండమిక్ లేకపోయినట్లయితే వకీల్ సాబ్ చిత్రం కనీసం మొదటి ఐదు రోజుల్లో 300 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉండేదని అంచనా.

అన్ని రకాల అడ్డంకులను దాటుకుని కూడా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించిన వకీల్ సాబ్ సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలబడిపోతుందనడంలో సందేహం లేదు.

జనసేన పార్టీ స్థాపించి రాజకీయంగా ముందుకు వెళుతున్న పవన్ కల్యాణ్ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు రకరకాల అడ్డంకులు సృష్టించారు.

చిత్రం విడుదలను అడ్డుకుంటే పవన్ కల్యాణ్ కు ఈ చిత్రం వరకూ ఎలాంటి నష్టం వాటిల్లదు కానీ రాబోయే చిత్రాలకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తారు. అలా పవన్ కల్యణ్ ఆర్ధిక మూలాలను అస్థిర పరచాలని ప్లాన్ చేశారు.

అయితే వారి ఆశలను నిరాశ చేస్తూ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి సంబంధించి పవన్ కల్యాణ్ కు వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా నష్టం కలిగించలేకపోయారు.

అదే విధంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆశించినంతగా కాకపోయినా ప్లస్ లోకే వచ్చారు. వెరసి చిత్రాన్ని అడ్డుకున్న వారికి తీవ్ర నిరాశ మిగిలింది.

Related posts

విజయనగరంలో డ్రగ్స్ కలకలం: ఇద్దరి అరెస్టు

Satyam NEWS

విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వెంట వందేభారత్‌ రైలు కావాలి

Bhavani

ఓ క‌లం వీరుడా ఇంకిపోవ‌డం త‌ప్ప ఒరిగిందేమీ లేదు

Satyam NEWS

Leave a Comment