29.7 C
Hyderabad
May 6, 2024 06: 26 AM
Slider హైదరాబాద్

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఆగిపోయిన ప‌నులు స్టార్ట్ చెయ్యండి సార్లూ…!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన నేప‌ధ్యంలో…హైద‌రాబాద్ ను..ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంచాల‌ని నాడు పార్ల‌మెంట్ తీర్మానం చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. అనూహ్యంగా గులాబీ పార్టీని యావ‌త్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు 2014 లో గెలిపించారు.

ప‌లు సంక్షేమ ప‌ధ‌కాల‌తో దూసుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి రెండో ప‌ర్యాయ‌మూ గెలిపి ప‌రిపాల‌న సాగిస్తున్న వేళ‌…స‌మస్య‌ల‌పై దృష్టి పెట్ట‌డం లేద‌ని స్వ‌యంగా ప్ర‌జ‌లే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ లో…ఎక్క‌డిక్క‌డే స‌మ‌స్య‌లు తిష్ట వేసాయి.

ప‌నిలో ప‌నిగా బీజేపీ త‌న పూర్వ బలాన్ని పుంజుకునే య‌త్నంలో ఉండ‌టంతో…అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న‌ను కాస్త వెన‌క్కు నెట్టి వేసే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది.ఈ నేప‌ధ్యంలో మ‌హాన‌గ‌ర‌మైన భాగ్య‌న‌గ‌రం అదీ..గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో…దాదాపు అన్ని డివిజ‌న్ల‌లో అటు త్రాగు నీరు,ఇటు పారిశుద్య స‌మస్య‌లు ఎక్క‌డిక్క‌డే తిష్ట వేసాయి..వీటి పరిష్కారంపై అధికార పార్టీ టీఆర్ఎస్ దృష్టి పెట్ట‌క‌పోగా…పేరుకుపోతున్న స‌మ‌స్య‌ల‌పై స‌మ‌ర భేరీ మోగించేందుకు బీజేపీ స‌మాయాత్త మ‌వుతోంది.

అందుకు గ్రేట‌ర్ లో బీజేపీ ఉన్న డివిజ‌న్ల‌లో తిష్ట‌వేసిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డం అటుంచి…జ‌రుగుతున్న ప‌నుల‌కు నిధులు రాక‌పోవ‌డంతో చాలా మంది కాంట్రాక్ట‌ర్లు మ‌ధ్య‌లోనే ప‌నులు నిలిపి వేసారు.దీంతో చాలా డివిజ‌న్ల‌లో ఎక్క‌డిక్క‌డే ప‌నుల నిల‌చిపోయాయి.

ఇక ప‌బ్లిక్, ప్రైవేటు,భాగ స్వామ్యంతో ప‌నులు జ‌రుగుతుండ‌టంతో…ఆయా కాల‌నీ వాసులల సంఘాల అనుమ‌తులు కూడాఅవ‌స‌రం. ఈ క్ర‌మంలోనే ఓ వైపు మ‌ద్యలో నిల‌చిపోయిన ప‌నులు ప్రారంభం కాక‌..జ‌రిగిన ప‌నుల‌కు నిధులు రాక పోవ‌డంతో కాంట్రాక్ట‌ర్లు ప‌నుల‌ను మ‌ధ్య‌లోనే నిలిపివేసారు.

దీంతో త‌క్ష‌ణం..ఆయా ప‌నుల‌కు నిధుల‌తో పాటు వాటిని వేగ‌వంతం అయ్యేలా చూసేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో అన్ని కాల‌నీ సంఘాలు అత్య‌వ‌స‌ర స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాయి.

అందులో భాగంగానే హైద‌రాబాద్ లో వ‌న‌స్థ‌లి పురం కాల‌నీ అసోసియేష‌న్ కూడా స‌మావేశంపై ప‌నులు జ‌ర‌పాల‌ని తీర్మానంచింది.ఈ స‌మావేశంలో అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి రామిరెడ్డి,ఉపాధ్య‌క్షులు వెంక‌టేష్, స‌భ్యులు ఓబులేష్, వేణు, నరేంద‌ర్, పురుషోత్తం, మ‌నోహ‌ర్, శీన‌య్య,సంతోష్, వంశీ,త‌దిత‌రులు పాల్గొని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు.

Related posts

అక్రమ సంబంధం కారణంగా దారుణ హత్య

Satyam NEWS

డిఎస్పీ శంకర్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Satyam NEWS

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

Satyam NEWS

Leave a Comment