39.2 C
Hyderabad
May 3, 2024 13: 43 PM
Slider నిజామాబాద్

దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన అసెంబ్లీ స్పీకర్

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు.

రుద్రూరు లోని జనరల్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, TRS పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి,బోదన్ RDO రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ సమాజంలో ఎక్కువ సంఖ్యలో పేదలుగా ఉన్నది దళితులు. వారు ఈ దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇబ్బందుల నుండి బయటపడి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలి అని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని దళితులకు ఒకేసారి పది లక్షల రూపాయల ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి నియోజకవర్గానికి వంద మందికి దళితబంధు ఇస్తున్నారు. కొత్త బడ్జెట్ ప్రకారం నియోజకవర్గానికి రెండు వేల మందికి దళితబంధు ఇస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.18000 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇలా సంవత్సరానికి కొంతమంది చొప్పున అందరికీ దళితబంధు అమలు చేస్తాం అని ఆయన అన్నారు.

ఈ పథకం లబ్ధిదారులు తమకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చు. ఈ పథకం మొత్తం ఖర్చు ఎనబైవేల కోట్ల రూపాయలు. ఎంత ఖర్చు అనేది ముఖ్యం కాదు దళితులు తలెత్తుకుని బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని పోచారం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు,ప్రజా ప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

Satyam NEWS

‘ఊరు ఊరుకి జమ్మి చెట్టు’ గొప్ప కార్యక్రమం

Satyam NEWS

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

Satyam NEWS

Leave a Comment