35.2 C
Hyderabad
April 27, 2024 14: 39 PM
Slider గుంటూరు

మధ్యతరగతి ప్రజలను నలిపేస్తున్న మోడీ ప్రభుత్వం

#MIMNarasaraopet

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన కు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ ధర్నా నిర్వహించింది. స్థానిక మార్కెట్ సెంటర్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లో వున్న మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నదని అందువల్ల పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కంటే, అదానీ, అంబానీ ల కుటుంబాల అభివృద్ధి పైనే దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.

మంచి ఆదాయం వున్న LIC, రైల్వే, లాంటి సంస్థల అమ్మకాలు, పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్యలని ఆయన అన్నారు.

దేశం లో వున్న పేద మధ్యతరగతి, కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. దేశ రాజధాని లో రైతులు 70 రోజుల పైబడి దీక్ష చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా రైతులను ఉగ్రవాదులు గా అభివర్ణించటం శోచనీయమని అన్నారు.

విశాఖ ఉక్కు కోసం ఎందరో మహానుభావులు బలిదానం చేశారని ఇప్పుడు ఆ పరిశ్రమ అమ్మకానికి పెట్టటం అన్యాయమని ఆయన అన్నారు. రాష్ట్రం లో వున్న ఎంపీలు ఎందుకు మౌనం గా వున్నారో అర్ధం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు మౌలాలి, కార్యదర్శి ఆరిఫ్, పార్టీ నాయకులు నాసర్ వలి, కరీం మస్తాన్ వలి, బీసీ నాయకులు, ఇంకోలు మల్లి, అన్నం మస్తాన్, కంది కట్టు కృష్ణ, కరెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మండుతున్న ఎండలు

Bhavani

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

Murali Krishna

మేం సేకరించే సమాచారం ఎక్కడికి వెళుతున్నది?

Bhavani

Leave a Comment