28.7 C
Hyderabad
April 27, 2024 05: 48 AM
Slider ముఖ్యంశాలు

బాగున్నాడని చెప్పిన గంటలోనే చనిపోయాడన్నారు

#gandhihospital

హైదరాబాద్ అంబర్ పేట లోని  గోల్నాక మార్కెట్ ప్రాంతానికి చెందిన మల్లంపేట యాదగిరి ముదిరాజ్  రెండు రోజుల క్రితం కరోనా బారినపడి గాంధీ హాస్పిటల్ లో చేరాడు.

గాంధీ ఆస్పత్రి వైద్యులు తన సోదరుడికి కి సరైన వైద్యం అందించ లేదని, కనీసం యాదగిరి మృతిచెందిన విషయం తనకు తెలుపలేదని ఆయన సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ ముదిరాజ్ ఆరోపించారు.

కరోనా తో బాధపడుతున్న తన  సోదరుడిని ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు గాంధీ ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు.

108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి వచ్చినప్పుడు, వార్డు బాయిలు ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా అతను మంచిగా మాట్లాడినట్లు సతీష్ తెలిపారు.

26వ తేదీ ఉదయం 11.30 ఈ ప్రాంతంలో కూడా తన సోదరుడు బాగానే ఉన్నాడని సతీష్ తెలిపారు. అన్నారు అయితే అదే రోజు మధ్యాహ్నం తన సోదరుడు చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అయితే తన తమ్ముడు చనిపోయిన విషయం తనకు 30 గంటలైనా సమాచారం అందించలేదని ఆరోపించారు.

ఆసుపత్రి  రిజిస్టర్ లో తన ఫోన్ నెంబరు ఉన్నప్పటికీ సమాచారం అందించ లేదన్నారు. 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సమాచారం అందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

27 వ తేదీన స్వయంగా గాంధీ కి ఫోన్ చేసి  తమ్ముడు గురించి అడగగా బాగానే ఉన్నాడని  ఆక్సిజన్ పెట్టామని అక్కడి సిబ్బంది తనతో చెప్పారని తెలిపారు.

బాగానే ఉన్నాడు అని చెప్పిన గంట సేపు తర్వాత అతను చనిపోయినట్లు తెలిపారని ఆరోపించారు.

నవ్వుతూ ఆస్పత్రికి వెళ్లి తన సోదరుడిని వైద్యం అందించలేదని శవాన్ని మార్చురీలో పడ వేశారని ఆయన ఆరోపించారు.

ఆసుపత్రిలో తన సోదరుడు ఫోన్ కూడా చోరీ చేశారని అన్నారు. ప్రస్తుతం తన సోదరుడి మృతదేహం మార్చురీలో కుళ్ళిపోయిన స్థితిలో ఉందని వాపోయారు.

తన సోదరుడి మృతికి ముమ్మాటికి గాంధీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని  ఇది ప్రభుత్వ హత్యే అని సీనియర్ జర్నలిస్టు సతీష్ ముదిరాజ్ ఆరోపించారు.

తక్షణమే దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని  తన సోదరుడి  మృతికి కారణమైన  గాంధీ ఆస్పత్రి వైద్యులు సిబ్బంది పై చర్యను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తన సోదరుడు యాదగిరి కి న్యాయం చేయాలని, దీనిపై తాను న్యాయస్థానాన్ని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు.

Related posts

కామారెడ్డి లో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

నాణ్యమైన, మన్నికైన ఔషదాలను ప్రజలకు అందించాలి

Satyam NEWS

ప్రజాపోరాటాలతోనే రాజధాని అమరావతిపై తాత్కాలికంగా వెనక్కి తగ్గిన జగన్

Satyam NEWS

Leave a Comment