Slider విజయనగరం

గుర్ర‌పు బ‌గ్గీపై ఏఎస్పీ అనిల్ కుటుంబాన్నిఊరేగించిన‌ డీఎస్పీ సిబ్బంది

“ఆత్మీయ వీడ్కోలు” సభలో – అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి

విజయనగరం డిఎస్పీగా పనిచేసి, అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతిపై, గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డ‌ర్ కు బదిలీపై వెళుతున్న అనిల్ ని విజయనగరం సబ్ డివిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది డిఎస్పీ కార్యాలయం వద్ద గల mol శౌర్యం ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా సత్కరించి, సన్మానించి, “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

ఈ సంద‌ర్బఃంగా వేదిక వద్ద‌కు గుర్ర‌పు బ‌గ్గీపై ఏఎస్పీ అనిల్ కుటుంబాన్ని తీసుకువ‌చ్చిన డీఎస్పీ సిబ్బంది…తీసుకువ‌చ్చారు.. ఓ వైపు డీజే స్థాయిలో మ్యూజిక్..మ‌రో వైపు ఎస్ఐ స్థాయి అధికారుల డ్యాన్స్ లతో స‌బ్ డివిజ‌న్ కార్యాల‌యం హోరెత్తింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి మాట్లాడుతూ – తాను జిల్లాలో పని చేసిన 20 నె ల‌ల కాలంలో తన పట్ల ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనన్నారు.

ఉన్నతాధికారులు తనకు అప్పగించిన బాధ్యతలను, ఆదేశాలను సబ్ డవిజన్ పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. క‌రోనా రెండో దశ ఉదృతంగా ఉన్న సమయంలో అప్ప‌టి జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ ఆదేశాలతో విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో పోలీసు సిబ్బందికి, అధికారులకు ఆక్సిజన్, హాస్పటల్ వసతులు కల్పించే విధంగా కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో కృషి చేశామన్నారు. సబ్ డివిజను పరిధిలో జరిగిన పలు దొంగతనాలను ఛేదించి, నిందితులను అరెస్టు చేసి, చోరీకి గురైన ఆస్తులను తిరిగి రికవరీ చేసామన్నారు. బంగారు షాపులో జరిగిన చోరీ కేసును కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఛేదించి, 6.5 కిలోల బంగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు.

అనేక సైబరు నేరాలను ఛేదించడంలోను, దిశ జాగృతి యాత్ర
నిర్వహించడంలో తనకు అన్ని విధాలుగా తోడ్పాటునందించిన జిల్లా ఎస్పీ గార్కి, ఇతర అధికారులు, సిబ్బందికి పేరు, పేరున అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి కృతజ్ఞతలు తెలిపారు.అంత‌కు ముందు విజయనగరం వ‌న్ టౌన్ సీఐ జె.మురళి మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న అదనపు ఎస్పీ అనిల్ పులిపాటిసబ్ డివిజన్ అధికారులకు మార్గదర్శకంగా ముందుండి, సమస్యలను పరిష్కరించేవారన్నారు. అధికారులు, సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావించి, ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పి, పోలీసుశాఖలో నూతన ఒరవొడికి శ్రీకారంచుట్టారన్నారు.

అనంత‌రంభోగాపురం సిఐ విజయనాథ్ మాట్లాడుతూ – సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ కేసు నమోదైన అయిన అదనపు ఎస్పీ అనిల్ తెలుసుకొని, కేసు తీవ్రతను బట్టి అందరికంటే ముందే సంఘటనా స్థలంకు చేరుకొని, సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపేవారని కొనియాడారు.

కార్య‌క్ర‌మంలో కొత్తవలస సీఐ బాల సూర్యారావు మాట్లాడుతూ – అదనపు ఎస్పీ అనిల్ క్రమశిక్షణ, సమయపాలన కలిగిన అధికారిగా, రాణించి, అన్ని వర్గాల మన్ననలు పొందారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంత‌రం సీసీఎస్ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు మట్లాడుతూ – సీసీఎస్ ఇన్ చార్జ్ గా అదనపు ఎస్పీ అనిల్ వచ్చిన తర్వాత సాంకేతికత ఆధారాలను వినియోగించి, ఎక్కువ కేసులను ఛేదించి, పెద్ద ఎత్తున పోయిన ఆస్తులను తిరిగి రికవరీ చేయగలిగామన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కొత్త‌వ‌ల‌స ఎస్ఐ గణేష్, పూసపాటిరేగ ఎస్ఐ ఆర్. జయంతి, రోటరీ క్లబ్ మెంబర్ రవి,కుటుంబ సభ్యులు జనార్ధన్, కుమార్, మీడియా ప్రతినిధులు శ్రీరామ్, జయరాజ్ ప్రసంగించి బదిలీ పై వెళుతున్న అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి సేవలను కొనియాడారు. అనంతరం, అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, ఆయన సతీమణి రోహిణి దంపతులను విజయనగరం సబ్డి విజన్ పోలీసు అధికారులు, సిబ్బంది గజమాల వేసి, పుష్ప గుచ్ఛాలు, సాలువలు, జ్ఞాపికలను అందజేసి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికగా, వేదపండితులు మంత్రోశ్చరణలతో ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో సిఐలు , సిహెచ్. లక్ష్మణరావు, టిఎస్ మంగవేణి, ఎస్.సింహాద్రి నాయుడు, ఎస్. కాంతారావు, అలాగే నెల్లిమ‌ర్లె ఎస్ఐ నారాయ‌ణ‌,గ‌రివిడి ఎస్ఐ లీలావ‌తి, గుర్ల ఎస్ఐ శిరీష‌,రూర‌ల్ ఎస్ఐ నసీం, మరియు ఇతర పోలీసు అధికారులు, అనిల్ పులిపాటి కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రముఖులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం. భారత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

q

Related posts

శ్రీ శుభకృతి కృతి

Satyam NEWS

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

పల్లా కు పట్టం కడతామని పట్టభద్రుల తీర్మానం

Satyam NEWS

Leave a Comment