31.7 C
Hyderabad
May 2, 2024 09: 37 AM
Slider నల్గొండ

జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్

#ytp hujurnagar

తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం తెలంగాణ సిద్ధాంత కర్త ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా YSR తెలంగాణ రాష్ట్ర పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ సార్ కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్నదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి మహనీయుడని,1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు జరిగిన నాన్ ముల్కీ ఉద్యమంలో,సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్ సార్  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పేవారని అన్నారు. 

2011 జూన్ 21న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారని, తెలంగాణ ఏర్పాటుకు జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని  అంకితం చేశారని,ఆ మహనీయుడు కన్న కలలను సాకారం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు YSR తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు బియ్యం, పెట్రోలు అందించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

దశదినకర్మకు ఆర్ధిక సాయం అందించిన కాంగ్రెస్ నేత

Satyam NEWS

Leave a Comment