హిజ్రాలతో అల్లరి చేసేందుకు వచ్చిన వై.సి.పి గూండాలు
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లో పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రస్తుం, భారత్ మైన్ లలో వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారం తో వైసీపీ నాయకులు గడిచిన 23 రోజులుగా అక్రమంగా, హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా వందల కోట్ల విలువైన క్వాడ్జి తవ్వి యదేచ్చగా తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాలను నిరసిస్తూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మూడురోజులుగా దీక్ష చేస్తున్నప్పటికి అధికార యంత్రాంగం పట్టించుకోలేదు.
దీక్షను ఎలాగైనా భగ్నం చేసి అక్కడ వాహనాలను తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు సుమారు 200 మంది హిజ్రాలు, వంద మంది వైసీపీ గుండాలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించి దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేశారు. దీన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. చివరకు సోమిరెడ్డి వద్దకు వచ్చిన పోలీస్ అధికారులు జోక్యం చేసుకొని మీ అనుచరులు మొత్తం పంపించి వేయండి…మీతో పాటు 5 మంది ఉంటే దీక్షకు భద్రత కల్పిస్తామని హామీనివ్వడంతో దీక్షా శిబిరం నుంచి టి. డి.పి శ్రేణులు వెనుదిరిగాయి. దాంతో సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష కొనసాగుతున్నది.