30.7 C
Hyderabad
April 29, 2024 06: 07 AM
Slider కవి ప్రపంచం

కాలమహిమ!

#shyamalanew

ఎవరికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలే

కానీ ఎవరి జీవితకాలం ఎంత ?

ఎవరి ఖాతాలో ఎంత కాలం ఉందో

ఎవరు చెప్పగలరు?

కాలం కొందరిని కరుణిస్తుంది

కొందరిని శపిస్తుంది

కొందరికి వేదననిచ్చి వేధిస్తుంది

కొందరికి ఆనందానిచ్చి అలరిస్తుంది

కలిసొస్తే పకపకలు

కాటేస్తే విలవిలలు

ఎవరికి ఏవి అమృత ఘడియలో

ఎవరికి ఏవి యమగండ కాలాలో

అంతా అయోమయం

కాలం..పని లెక్కలయితే తెలుసు కానీ

ఎంత కాలంలో .. ఏ స్థాయిలో

ఎంత సుఖమో..ఎంత దుఃఖమో

ఎవరు చెప్పగలరు?

పరుగులు తీసే కాలంలో

పడుతూ..లేస్తూ

అనుభవం వచ్చిందని అపోహ తప్ప

కాల మహిమ తెలియతరమా!

జె.శ్యామల

Related posts

నిరాశ్రయులైన రోగులకు అండగా నిలిచిన కడప డి.ఎస్.పి

Satyam NEWS

ఉపాధి బిల్లులు చెల్లించని జగన్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు

Satyam NEWS

న్యూ ఇన్ వెన్షన్ : ఇక క్యాన్సర్‌కు కీమోథెరపీ అవసరం లేదు

Satyam NEWS

1 comment

Gannavarapu+Narasimha+Murty October 4, 2023 at 9:02 AM

కాల మహిమ తెలియ తరమా అన్నది నిష్టుర సత్యం
కవిత బాగుంది
రచయిత్రి గారికి అభినందనలు

Reply

Leave a Comment