29.7 C
Hyderabad
May 3, 2024 06: 59 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా మత్స్యకార గ్రామాల్లో పోలీసుల చైతన్య కార్యక్రమం

#vijayanagarampolice

సైబర్ నేరాల పట్ల మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన కల్పించేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ మండలం రెల్లివలసలో   నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  ఎం.దీపిక పాల్గొన్నారు.

ప్రజలకు ఓటిపి, జాబ్ ఫ్రాడ్స్, కేవైసి పేరుతో వచ్చే లింకులు, ఈ-మెయిల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చైతన్య పరిచారు. సైబర్ సైట్లను వాటిని గురించి పూర్తిగా తెలియకుండా క్లిక్ చేయవద్దని, అవగాహనతోనే సైబరు నేరాలను నియంత్రించ వచ్చునన్నారు.

సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను, కర పత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరించి, మహిళా పోలీసులకు, ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భోగాపురం సీఐ కేకేవి విజయనాధ్,పూసపాటిరేగ ఎస్ఐలు జయంతి, పద్మావతి, మహేష్, ప్రశాంత్ కుమార్, నర్సింగరావు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వేంకటరమణ దీక్షితులు ఉద్వాసనకు రంగం సిద్ధం

Satyam NEWS

Analysis: తుంటరి ట్రంప్ పోగాలపు పనులు

Satyam NEWS

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి కావలసిందేనా?

Satyam NEWS

Leave a Comment