31.7 C
Hyderabad
May 2, 2024 09: 12 AM
Slider విజయనగరం

ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవ్వాల్సిన చేత్తో పార పట్టిన పీసీ..!

#road

ఎస్ఐ ఆదేశాలతో రంగంలో కి దిగిన ఏఎస్ఐ, పీసీలు

మీరు చదివిన హెడ్డింగ్…ఐ మీన్ క్యాప్షన్ కరెక్టే.విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ దరి..ఎత్తు బ్రిడ్జి సమీపంలో… ఎస్పీ బంగ్లా కు వెళ్లే జంక్షన్.. మయూరీ జంక్షన్…. అదే హిమగిరి జంక్షన్. సరిగ్గా ఆ జంక్షన్ లో కొత్తగా… నాలుగు వైపు ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తోంది… పోలీసు శాఖ. అయితే కార్పోరేషన్ గా ఎదిగిన విజయనగరం లో రోడ్ల వెడల్పు లతో పాటు… ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొత్త గా ఏర్పాటు కాబోతున్నాయి.ఇటీవలే ఐస్ ఫ్యాక్టరీ వద్ద…బాలాజీ జంక్షన్ వద్జ ,దాసన్నపేట రింగ్ రోడ్ ఇలా ఆయా జంక్షన్ లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది… పోలీసు శాఖ..కాదు కాదు ట్రాఫిక్ విభాగం. అందులో భాగంగా దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం ఉన్న మయూరీ జంక్షన్ లి ఒకేచోట ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ను నాలుగు వైపులా పెట్టేందుకు చర్యలు షురూ అయ్యాయి.

ఈ క్రమంలో ఉదయం పూట…వాహనాల రద్దీ ఉండటంతో పొద్దున్నే కానీ లేదా రాత్రి తొమ్మిది తర్వాత పనులు చేపట్టాలి.ట్రాఫిక్ సిబ్బంది ఉండగానే పనులు జరగాలి. అలాకాక… ట్రాఫిక్ రద్దీ అయినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పనులు చేపట్టడం అందుకు రోడ్ పై అడ్డంగా తవ్వకాలు చేపట్టి…అప్పటికి పూర్తి చేశారు.. అయితే ఉదయం తొమ్మిది గంటలవ్వడం..ఆఫీస్ లకు స్కూళ్లకు వివిధ పనులకు… వాహనాలు మయూరీ జంక్షన్ లోనే తిరగడంతో పనిలో పనిగా..ట్రాఫిక్ ఎస్ఐ కూడా బైక్ పై వెళ్లి… ప్రమాద బారిన పడ్డారు. అప్పటికి గాని పోలీసులకు తెలియరాలేదు. వెనువెంటనే పోలీసు బాస్ తెలియడంతో… ట్రాఫిక్ డీఎస్పీ కి ఆదేశాలు… అక్కడ నుంచీ ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు సూచనలు చకచకా అందడంతో ఆఘమేఘాల మీద.. ఘటనా స్థలికి వచ్చి… గోతులను మూయించే పనిలో పడ్డారు. ఏదైనా అటు పోలీసు ఇటు మున్సిపల్ శాఖ మధ్య లోపంచిన సమన్వయమే కారణమి “సత్యం న్యూస్.నెట్” అంటోంది.

Related posts

చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం

Satyam NEWS

వైసీపీ నేతల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

రాముని లంకలో రావణాసురుడి క్రీడ…ఇప్పుడే మొదలైంది

Satyam NEWS

Leave a Comment