36.2 C
Hyderabad
April 27, 2024 21: 39 PM
Slider విజయనగరం

సేవా కార్యక్రమంలో ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు..!

#police

విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఆదేశాలతో అటు ట్రాఫిక్ ఇటు ఆర్మర్డ్ పోలీసులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం లోని పోలీసు బ్యారెక్స్…”దిశ” పీఎస్ వద్ద..ఈ తెల్లవారుజామున వీసిన భారీ గాలికి… అతి పేద్ద మర్రిచెట్టు కూలిపోవడంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు హుటాహుటిన వెళ్లి… మర్రి చెట్టు ను తొలగించి..వచ్చే పోయే వాహనాలకు అసౌకర్యం లేకుండా చూసారు.ఈ మేరకు ట్రాఫిక్ ఎస్ఐ రాజు ,ఏఎస్ఐ నూకరాజు లు పాల్గొన్నారు.

ఇక జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది  మద్యం, ఇసుక, గంజాయి, పశువులు అక్రమ రవాణా, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు, సెబ్ అధికారులు జిల్లాలో మద్యం, నాటుసారా నియంత్రణలో భాగంగా దాడులు నిర్వహించారు. బొండపల్లి పీఎస్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, 3 బోలోరో వాహనాలు, 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై 17 కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 20 కేసులు నమోదు చేశారు. ప్రజలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, దిశ యాప్ ను 4,792 మందితో డౌన్లోడ్ చేయించారు. ఇప్పటి వరకు 7,96,812మంది యాప్ డౌన్లోడ్ చేయించగా, 4,68,241మంది తో రిజిస్ట్రేషన్ చేయించారు.

Related posts

స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించాలి

Bhavani

ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలి

Bhavani

OTC Green Tea Weight Loss Pills Vitamin Shoppe Most Effective Weight Loss Pill For Women Over 50

Bhavani

Leave a Comment