37.2 C
Hyderabad
May 1, 2024 12: 59 PM
Slider ముఖ్యంశాలు

రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ షర్మిల

#YS Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు, ఇది చాలా సంతోష‌క‌ర‌మైన రోజని, మీరు మీ ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో ప్ర‌జ‌ల‌కు స్పూర్తినిస్తూ హృద‌య పూర్వ‌క ప్ర‌య‌త్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాల‌ని షర్మిల ట్వీట్ లో కోరారు.

ఆరోగ్య‌వంతంగా, సుఖ సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని అకాంక్షించారు.తెలంగాణలో వైఎస్పార్ టీపీ ని కాంగ్రెస్ లో కలిపేస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాహుల్ కు షర్మిల విషెస్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకించి రాహుల్ కు షర్మిల ట్వీట్ చేయటం వెను క ఉద్దేశం కూడా అదే అని పలువురు నేతలు రీ ట్వీట్లు మొదలుపెట్టారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రెండు సార్లు బెంగళూరు వెళ్లిన షర్మిల డిప్యూటీ సీఎం ను కలిసిన సందర్భాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం అవన్నీ ఏమీ లేవని , తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

Related posts

పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

Satyam NEWS

సోషల్ మీడియానే నిజమని నమ్ముతున్న ఇండియా

Satyam NEWS

బాసరలో ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి

Satyam NEWS

Leave a Comment