37.2 C
Hyderabad
May 1, 2024 11: 04 AM
Slider విజయనగరం

కొత్త ఎస్పీ’స్పందన’ నిర్వహణ..ఒకేసారి 32 ఫిర్యాదులు స్వీకరణ..!

#vijayanagaram police

విజయనగరం జిల్లా కొత్త ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన దీపికా పాటిల్ తొలిసారిగా జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ స్పందనలో దాదాపు 32 ఫిర్యాదులను బాధితుల నుంచీ ఎస్పీ దీపికా పాటిల్ స్వీకరించారు. వివరాలిలా ఉన్నాయి.

ఎస్. కోట మండలం ధర్మవరంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భూములను కొడుకులకు పంపకాలు చేసి, తమ పోషణ నిమిత్తం వేమలాపల్లిలోగల కొంత భూమిని తమ వద్ద ఉంచుకొని, వ్యవసాయం చేసేందుకు వేరే వ్యక్తికి కౌలుకు ఇవ్వగా, వారిని వ్యవసాయం చేయకుండా తమ కుమారుడు, కోడలు అడ్డుకుంటున్నారని, తగిన న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు చేపట్టి, న్యాయం చేయాల్సిందిగా ఎస్.కోట సీఐను ఆదేశించారు. రామభద్రపురం మండలంకు మీర్తివలసకు చెందిన ఒక వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన బావ సాలూరుకు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన అక్కను, వారి పిల్లలను సక్రమంగా చూడడం లేదని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిచి, కౌన్సిలింగు నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాలూరు సీఐను ఆదేశించారు. విజయనగరం వీటి అగ్రహారంకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు రైల్వేలో ఉద్యోగం కల్పిస్తానని గుర్ల మండలంకు చెందిన ఒక వ్యక్తి అడ్వాన్సుగా  లక్ష తీసుకొనినట్లు, ఇప్పుడు తమకు డబ్బులు తిరిగి ఇవ్వడం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, ఫిర్యాదుదారునికి న్యాయం చేయాల్సిందిగా విజయనగరం రూరల్ ఎస్ ఐను ఆదేశించారు. పాచిపెంట మండలం కోస్టువలస కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమకు సాలూరు మండలం కొత్తవలసలో 3.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, సదరు భూమిని తమ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, తమను బెదిరిస్తున్నారని, న్యాయం చేయాల్సిందిగా కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ ఇరు వర్గాలను పిలిపించి, డాక్యుమెంట్లును పరిశీలించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని సాలూరు సీఐను ఆదేశించారు. జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు పార్వతీపురం పట్టణంకు చెందిన ఒక టీచర్ ఒక ఇంటి స్థలంను నాకు 16లక్షలకు 2018లో అమ్మినారు.

కానీ, సదరు స్థలం 2016లోనే వేరే వ్యక్తి పేరున రిజిస్ట్రేషను అయి ఉన్నట్లుగా మాకు తెలిసినట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ జరిపి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం సీఐను ఆదేశించారు.

విజయనగర శివారు దుప్పాడ కి చెందిన ఒక మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఏడాది క్రితం మెంటాడ మండలం జయితి లో 0-65 సెంట్లు భూమిని తన తండ్రి నుండి 10 లక్షలకు కొనుగోలు చేసినట్లు, సదరు భూమిలో వ్యవసాయం చేయకుండా ఆమె అన్నదమ్ములు అడ్డుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ వర్గాలను పిలిపించి, డాక్యుమెంట్లు ను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకొని, ఫిర్యాదుదారునికి న్యాయం చేయాలని విజయనగరం 1వ పట్టణ సీఐను ఆదేశించారు.

ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, డీసీఆర్ బి సీఐ బి. వెంకటరావు, ఎస్పీ సీఐలు ఎన్. శ్రీనివాసరావు, సిహెచ్. రుద్రశేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS

మాట మార్చిన ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ నిరసన

Satyam NEWS

రైతుకు ఆర్థిక సహాయాం అందజేసిన జర్నలిస్టు

Satyam NEWS

Leave a Comment