19.7 C
Hyderabad
December 2, 2023 05: 34 AM
Slider విజయనగరం

క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న విజయనగరం పోలీసులు

#police

సమాజంలో క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నదెవంటే పోలీసులే అని చెప్పకతప్పదు.పోలీసు మాన్యువల్ లోనే…ఖాళీ అన్న పదం లేకుండా ఖాకీ యూనిఫామ్ వేసుకున్న ప్రతీ పోలీసు పని చేయాలని ఉంది. పోలీసు స్టేషన్ కు వెళ్లి ఉద్యోగం చేయడమే కాదు…తెల్లారు లేచింది మొదలు.. ఎక్కడ ధర్నా జరిగినా..ఎక్కడ ప్రమాదం జరిగిన..ప్రభుత్వ అధికార కార్యక్రమాలు.. మంత్రులకు బందోబస్తు.. పోలీసు ఉన్నతాధికారులను అంటి పెట్టుకుని ఉండటం.. కోర్ట్ లు ,సమన్లు ఇవ్వడం..ఇలా ప్రత్యేక విషయంలో ను పోలీసుల పాత్ర అనన్య సామాన్యం.

సరే ఈ సోదిని పక్కన పెట్టి పాయింట్ కు వస్తే… విజయనగరం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో వన్ టౌన్ పోలీసు స్టేషన్. ఒక సర్కిల్ ఇన్ స్పెక్టర్, అయిదు గురు సబ్ ఇన్ స్పెక్టర్లతో అను నిత్యం అత్యంత బిజీగా ఉండే స్టేషన్. గడచిన మూడు రోజుల నుంచీ అంటే సోమ ,మంగళ, బుధవారాలలో విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆందోళనలు, నిరసనలు, ధర్నా లు జరుగుతుండటం…అదీ కాస్త వన్ టౌన్ పరిధిలోని ఉండటం తో…ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా… పోలీసు బాస్ అదేశాలు… డీఎస్పీ సూచనలతో విజయనగరం వన్ టౌన్ లో పని చేస్తున్న అయిదుగురు ఎస్ఐ లు… కలెక్టరేట్ వద్దే అలుపెరగకుండా విధులు నిర్వర్తించారు.

జీతం తీసుకోవడం లేదా…విధులు ఆ మాత్రం నిర్వర్తించరా అని అడగకండి…పోలీసు అంటే…పొగరు, అహం…ఖాకీ యూనిఫాం తో జనాలను జడిపించే ఖాకీ లను చాలా మంది ని చూసింటారు.కానీ వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎస్ఐ లు భాస్కరరావు, అశోక్ ,మురళీ, గోపాల్, రామ్ గణేష్ లు…భార్య ,పిల్లలు కుటుంబాన్నే పక్కన పెట్టి.. అనునిత్యం రోడ్ మీదనే విధులు నిర్వర్తించడం..హేట్సాఫ్ చెబుతోంది..”సత్యం న్యూస్.నెట్ “. సలాం సబ్ ఇన్ స్పెక్టర్ సాబ్…!

Related posts

వనపర్తిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

Satyam NEWS

విభజన హామీలను తక్షణమే అమలు చేయాలి

Bhavani

రాజకీయాలకు అతీతంగా అందరిని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!