36.2 C
Hyderabad
April 27, 2024 21: 42 PM
Slider ముఖ్యంశాలు

జ‌గ‌న్‌ది ఫ్యాక్ష‌న్ క‌క్ష‌.. ధ‌ర్మ‌మే టిడిపికి ర‌క్ష‌

#AP CM YS Jagan Reddy

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వంతో టిడిపిపై క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ధ‌ర్మ‌మే టిడిపికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని టిడిపి నేత‌లు ధీమా వ్య‌క్తం చేశారు. ఢిల్లీ అశోకా రోడ్డు 50లోని ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం టిడిపి ఎంపీలు, అందుబాటులో ఉన్న టిడిపి నేత‌ల‌తో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మావేశం అయ్యారు. చంద్ర‌బాబు గారి అక్ర‌మ అరెస్టు, వైకాపా స‌ర్కారు పెడుతున్న త‌ప్పుడు కేసులు, టిడిపి న్యాయ‌పోరాటం అంశాల‌పై చ‌ర్చించారు.

ఎటువంటి సంబంధంలేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారా లోకేష్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖ‌లు చేయ‌డంపైనా టిడిపి నేత‌లు చ‌ర్చించారు. లోకేష్‌ది ఇన్న‌ర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన శాఖ కాక‌పోయినా, అస‌లు ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అనేది వేయ‌క‌పోయినా, ఇందులో స్కాం అంటూ కేసు న‌మోదు చేసి..అందులో A14గా నారా లోకేష్ పేరు చేర్చారంటేనే…ఇది ముమ్మాటికీ జ‌గ‌న్ రెడ్డి మార్క్ ఫ్యాక్ష‌న్ క‌క్ష‌సాధింపుయేన‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేక‌పోయినా చంద్ర‌బాబు గారిని అరెస్టు చేసిన‌ట్టే, లోకేష్‌నీ సంబంధ‌మే లేని కేసులో ఇరికించాలని చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుని వేధించినా, ధ‌ర్మం టిడిపి ప‌క్షాన ఉంద‌ని, న్యాయ‌పోరాటం ద్వారా ఎదుర్కొందాం అని తీర్మానించారు.

యువ‌గ‌ళం మ‌ళ్లీ ప్రారంభిస్తాన‌ని లోకేష్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో .. ఎలాగైనా పాద‌యాత్రని అడ్డుకోవాల‌ని ఈ త‌ప్పుడు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని టిడిపి నేత‌లు మండిప‌డ్డారు. అరాచ‌క వైసీపీ పాల‌న‌పై తెలుగుదేశం పార్టీ త‌ల‌పెట్టిన జ‌న‌చైత‌న్య కార్య‌క్ర‌మాలు ఏ ఒక్క‌టీ ఆగ‌వ‌ని, ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా యువ‌గ‌ళం ఆగ‌ద‌ని, ధ‌ర్మం టిడిపి వైపు ఉంద‌ని, న్యాయ‌పోరాటంలో విజ‌యం సాధిస్తామ‌ని టిడిపి ఎంపీలు, నేత‌లు ధీమా వ్య‌క్తం చేశారు.

ఏపి లో జరుగుతున్న కక్ష సాధింపు రాజకీయం జాతీయ స్థాయిలో ఎండగట్టాలని, మన వైపు న్యాయం ఉంది, ఏ తప్పూ చేయలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయి. వీటిని జాతీయ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా పోరాడాలని లోకేష్ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. జగన్ ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులు – నిజాలు వివరిస్తూ టిడిపి తయారు చేసిన పుస్తకాలు పంపిణీ చేసి జాతీయ మీడియా, జాతీయ నాయకులకి ఏపి లో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించాలని లోకేష్ ఎంపీలతో అన్నారు.

Related posts

గల్ఫ్ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం

Bhavani

ఆన్ డ్యూటీ:విప్‌గా బాధ్యతలు స్వీకరించిన గంప గోవర్థన్

Satyam NEWS

కొండగట్టులో రామపూజ స్థూపానికి భూమి పూజ

Satyam NEWS

Leave a Comment