33.7 C
Hyderabad
April 29, 2024 01: 29 AM
Slider ప్రత్యేకం

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

#Chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది. ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు… ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు బదలీ అయ్యే అవకాశముంది.విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుంటే ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Related posts

ఫుడ్ పాయిజనింగ్ విద్యార్ధుల్ని పరామర్శించిన షబ్బీర్ అలీ

Satyam NEWS

దళిత గిరిజన భూముల్ని లాక్కుంటున్న ప్రభుత్వం

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న వారికి ప్రశంస

Satyam NEWS

Leave a Comment