42.2 C
Hyderabad
April 30, 2024 18: 29 PM
Slider విజయనగరం

ప్ర‌జ‌లంద‌రికీ రోటరీ క్లబ్ ఉచితంగా డ‌యాబ‌టీస్ ప‌రీక్ష‌లు

#rotaryclub

రోట‌రీ క్ల‌బ్ విజ‌య‌నగ‌రం సంస్థ‌…ఒక్క రోజులోనే  మిలియ‌న్ మందికి ఉచితంగా డ‌యాబ‌టీస్ వ్యాథికి ఉచితంగాప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రం క్ల‌బ్…సింహాచ‌లం మేడ వ‌ద్ద ఉన్న డా.పీ.వీ.జీ.రాజు రోట‌రీ హెల్ల్ సెంట‌ర్  లోఉచితంగా ప్ర‌జ‌లంద‌రికీ డ‌యాబెటీస్, షుగ‌ర్ వ్యాధి నిర్దార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.

ఈ మేర‌కు రోట‌రీ క్ల‌బ్ త‌రుపున  డా.కామేశ్వ‌ర‌రావు…క్ల‌బ్ కువ‌చ్చిన వారికి ఉచితంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మందులు రాసారు. ఈ ఒక్క రోజులో ఒక  మిలియన్ మంది ప్రజలకి  ఉచితంగా చక్కెర వ్యాధి నిర్దారణ పరీక్షలు  చేసి  ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకొంది.

రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో న‌గ‌రంలో ఐదు సెంటర్లలో కలిపి సుమారు 1000 మందికి ఉచిత మధుమేహం రక్త పరీక్షల నిర్వహించడం జరిగింది. విజ్జీ స్టేడియం, క్వీన్స్  ఎన్.ఆర్.ఐ హాస్ప‌ట‌ల్,ఇలా  న‌మోదైన సెంట‌ర్ ల‌లో ఉద‌యం08.30 నుంచీ 10.30 వ‌ర‌కు  ఉచిత‌మ‌ధుమేహ‌,షుగ‌ర్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి.

ఈ కార్యక్రమానికి రోట‌రీ జిల్లా నేత‌లు  మడిపల్లి రామారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా అధ్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శి జగదీష్ బాబు ,డాక్టర్ ఆర్ పి వి జి రాజు రోటరీ హెల్త్ సెంటర్ చైర్మన్ గ్రంధి సర్వరాయ గుప్తా, సెక్రటరీ కే ఆర్ కె రాజు తో పాటు రోటరియన్లు కే శ్రీనివాస్, పి స్ సి నాగేశ్వరరావు, శంకర్ రెడ్డి,సి పి జైన్ , పవన్ ,ముకుంద్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేట మునిసిపాలిటీకి రామచంద్రారెడ్డి

Satyam NEWS

అట్టల ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

నకిలీ విత్తనాలు అమ్ముతున్న దుకాణాల సీజ్

Bhavani

Leave a Comment