28.7 C
Hyderabad
April 28, 2024 03: 15 AM
Slider కడప

మునక వాసుల పొలాలకు పరిహారం చెల్లించాలి

#kadapadist

కడప జిల్లా నందలూరు సోమశిల మునక ప్రాంతం పొత్తపిలో ఓ వర్గం భూ పరిహార బాధితులు అధికారులును అడ్డుకొని సమస్యల ఏకరువు పెట్టారు.

కడప జిల్లా నందలూరు మండలం సోమశిల మునక ప్రాంతం పొత్తపిలో బుధవారం అధికారులను గ్రామ సరిహద్దులో మునక బాధితులు అడ్డుకున్నారు.మునక ప్రాంతం గ్రామ సభలో గాలేరు నగరి సుజల స్రవంతి స్పెషల్ కలెక్టర్ యం. రామ్మోహన్, సోమశిల డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొనడానికి వచ్చారు.

అయితే భూ పరిహార బాధితులు పొత్తపి గ్రామ శివారు లో రోడ్డుకు అడ్డంగా కూర్చోని అడ్డగించారు.ఈ సందర్భంగా అధికారులకు బాధితులు, పొలాలకు ముందు పరిహారం చెల్లించి ఇండ్ల కు ఇవ్వాలని బాధితుల డిమాండ్ చేశారు.

అనంతరం శివాలయం వద్ద జరిగిన గ్రామసభలో మునక బాధితులు అందరూ సమిష్టి గా ఒక్క నిర్ణయం తీసుకొని సహకరిస్తే,ఒకటో తేదీ నుంచి సర్వే నిర్వహిస్తామని గాలేరు నగరి సుజల స్రవంతి స్పెషల్ కలెక్టర్ యం. రామ్మోహన్,వెల్లడించారు.

Related posts

దారుణం

Murali Krishna

నులి పురుగుల మందు సరఫరా కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment