31.2 C
Hyderabad
May 3, 2024 00: 25 AM
Slider విజయనగరం

క‌ళాశాల విద్యార్దుల‌తో విజయనగరం ఎస్పీ దీపిక ముఖాముఖీ

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం  జిల్లా పోలీస్ కార్యాల‌యంలో బేర‌క్స్ వ‌ద్ద  పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్బంగా ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది…జిల్లా పోలీస్ శాఖ‌. ఈ ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మానికి ప‌లు పాఠ‌శాల‌, క‌ళాశాల నుంచీ విద్యార్ధినీ, విద్యార్దుల‌తో  వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ఎస్పీ దీపికా విద్యార్ధులతో  ముఖాముఖీ నిర్వ‌హించారు. మీరేం చ‌దువుతున్నారు..?  చ‌దువు అయ్యాక ఏమ‌వుతారు అంటూ విద్యార్దుల‌ను ప్ర‌శ్నించారు. ఈ నేప‌ధ్యంలో స‌రాసరి ఓ విద్యార్ధిని నువ్వేమి అవుతావు అంటే…కానిస్టేబుల్ అవుతాన‌ని చెప్పాడు. పోలీసుల‌లో స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ పాత్ర అమోఘ‌మని ఎస్పీ  విద్యార్ధులకు తెలిపారు.ఓ విద్యార్ధి  ఆర్మీ జ‌వాన్ అవుతాన‌ని చెప్ప‌డంతో పోలీస్ ఎందుకు కాకూడ‌ద‌ని..వాళ్లు చేస్తున్న స‌ర్వీసు అనిర్వ‌చ‌నీయ‌మ‌న్నారు.పోలీసులేనిదేవ్య‌వ‌స్థ లేద‌ని..ప్ర‌స్తుతం  ఆధునిక ప‌రిజ్ఙానం వ‌చ్చిన దాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేది సబ్ ఇన్ స్పెక్ట‌ర్ స్థాయీ సిబ్బందేన‌ని ఎస్పీ తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలోవిజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్,ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు, ఎస్ఐ హ‌రి ప్ర‌సాద్,పీఆర్ఓ కోటేశ్వ‌ర‌ర‌రావు,శ్రీనివాస్, కిషోర్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎన్.సీ.సీ స్టూడెంట్లతో ఎస్పీ దీపికా ఫేస్ టూ ఫేస్…!

పోలీస్ అవ్వండి…నేరగాళ్ల భ‌ర‌తం ప‌ట్టండి అంటూ పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్బంగా పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్ లో శాఖ నిర్వ‌హించిన ఓపెన్ హౌస్ సంద‌ర్బంగా వ‌చ్చిన ఎన్.సీ.సీ కేడెట్ల నుద్దేశించి ఎస్పీ దీపిక మాట్లాడారు. దిశ యాప్…అలాగే స‌మాజంలో జ‌రుగుతున్న నేరాలు….వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి..వాటిని అరిక‌ట్టేందుకు పోలీస్ ఒక్క‌టే స‌మాజానికి ఆయుధ‌మ‌ని ఎస్పీ సూచించారు.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు వాడే  ప్ర‌తీ ఒక్క‌రూ దిశ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకోవాల‌ని…మీ స‌మీప ప్రాంత‌ల‌లో అమ్మాయిల‌ను వేడిపించే వాళ్ల‌కు దిశ యాప్ ఒక ఆయుధంగా  ప‌ని చేస్తుంద‌ని ఎస్పీ దీపికా తెలిపారు.ప్ర‌తీ  ఒక్క‌రూ ఆ యాప్ ప‌ట్ల అవగాహ‌న క‌లిగి ఉండాల‌ని ఎస్పీ ఈ సంద‌ర్బంగా ఎస్పీ కోరారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

Satyam NEWS

కొల్లాపూర్ కోటలో ప్లాట్లు కొంటే ఆగమౌతారు జాగ్రత్త

Satyam NEWS

ఎలారమింగ్: కట్టు దాటి పోతున్న కరోనా వైరస్

Satyam NEWS

Leave a Comment