37.2 C
Hyderabad
May 6, 2024 20: 32 PM
Slider ముఖ్యంశాలు

చెత్త పన్ను అధిక వసూలు పై విజయనగరం టీడీపీ నిరసన

#vijayanagaramTDP

రాష్ట్ర ప్రభుత్వం “చెత్త” పై పన్ను వేసి ప్రజలపై మోపిన భారాన్ని వెంటనే ఎత్తివేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కొ ఇల్లులను  లబ్దిదారులకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు  విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాన్ని విజయనగరం టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి, అనంతరం  దీక్ష లో పాల్గొన్న నాయకులకు కండువా వేసి, పూల మాల వేసి దీక్షను ప్రారంభించారు. 

ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని, టీడీపీ ప్రభుత్వం హయాంలో 90 శాతం పూర్తి చేసిన టి డ్కొ ఇల్లును మూడేళ్లు పూర్తయినా లబ్ధిదారులు చేతికి ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇలాంటి వారు మూడు రాజధానులు కడతామని కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే ఆలోచలనాలు చేతకాని ఈ  అసమర్ధ ప్రభుత్వం చెత్త పై పన్ను వేసి పేదప్రజలపై భారాన్ని మోపుతోందని ధ్వజమెత్తారు.  ఇప్పటికైనా ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచన చేసి ప్రజలకు భారమైన ఇలాంటి నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు పార్టీ అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు విజ్జపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ మేరకు మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు, కార్పొరేటర్ కర్రోతు రాధా మణిలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప జేశారు.

Related posts

పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలి

Satyam NEWS

బీసీల నెత్తుటితో తడుస్తున్న మాచర్ల నేల..!

Satyam NEWS

సంజనా, రాగిణిలకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment