42.2 C
Hyderabad
April 26, 2024 17: 23 PM
Slider విజయనగరం

“స్పందన” నకు 40 ఫిర్యాదులు: విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక

#deepikaips

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ 40 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ  “స్పందన” కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ 40 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

సాలూరు మండలం, కరాసువలస కి చెందిన ఒక బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు దత్తివలసకు చెందిన వ్యక్తితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, తన భర్త తనను అదనపు కట్నం కోసం వేధించి, ఇంటినుండి పంపివేసి తను వేరే ఆమెను వివాహం చేసుకొన్నారని, తన భర్తపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్టపరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని సాలూరు రూరల్ ఎస్ఎని అదేశించారు.

ఎల్.కోట మండలం, లక్ష్మిపేట కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు తన గ్రామంలో మూడెకరాల భూమి ఉన్నట్లు, తన భూమిని సర్వే చేయుటకు వెళ్ళగా తన తమ్ముళ్ళు అడ్డుకొని బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని ఎల్.కోట ఎస్ఐని ఆదేశించారు.

విజయనగరం తోటపాలెంకు చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు తన భర్త గత రెండేళ్ల నుండి అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం దిశ పోలీసు స్టేషను సీఐని ఆదేశించారు.

పూసపాటిరేగ మండలం, కందివలసకి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన గ్రామంలో తనకు 36 సెంట్లు ఖాళీ స్థలం ఉన్నట్లు సదరు ఖాళీ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, అతని పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని పూసపాటిరేగ ఎస్ఐను అదేశించారు.

విజయనగరం హుకుంపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తన కుమారుడు, తన, తన భార్య బాగోగులు చూడకుండా తమను ఇంటి నుండి పంపివేయడానికి చూస్తున్నాడని, తమకి న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాది పై స్పందించిన ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకొని, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐని ఆదేశించారు.

విజయనగరం, వి.టి. అగ్రహారంకు చెందిన ఓ బాధితురాలు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తూ తమకు వాసరసత్వంగా వచ్చిన 25 సెంట్లు భూమి ఉన్నట్లు సదరు భూమిలో కొంత భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి అమ్మడానికి చూస్తున్నట్లు, తనకు న్యాయం చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదిపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం రూరల్ ఎస్ఐని ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను తనకు వెంటనే నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపిక ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డీసీఆర్ బి సీఐ డా.బి. వెంకటరావు, ఎస్బీ సీఐలు ఎన్. శ్రీనివాసరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, డీసీఆర్ బి ఎస్ఐ లు మురళి, వి.సూర్యారావు, దేముడు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కెటిఆర్ వ్యాఖ్యలకు బాలకోటయ్య కౌంటర్

Satyam NEWS

రాజధానికి చెందిన మరో రైతు గుండె ఆగింది

Satyam NEWS

రవాణా శాఖ కు భారీగా ఆదాయo

Murali Krishna

Leave a Comment