31.7 C
Hyderabad
May 2, 2024 09: 06 AM
Slider వరంగల్

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ….

#mulugudistrict

స్వయం పరిపాలన దినోత్సవం ( విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ) కార్యక్రమాన్ని ములుగు జిల్లా బరిగలపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్త పల్లి పోషన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పింగళి నాగరాజు, స్థానిక సర్పంచ్ గరిగ లత నర్సింగరావు, పాఠశాల ఛైర్మన్ కాయిత రమేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాగరాజు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఈవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు.

ఇప్పటి నుంచే విద్యార్ధుల్ని ఇన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొనే విధంగా తయారు చేయడం మంచి పని అని అన్నారు. విద్యార్ధులు కూడా ఇంత ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషం అన్నారు. ఈవిధంగా చిన్నారి విద్యార్థులు ఉపాధ్యాయులు గా వ్యవహరించినందుకు  అభినందనలు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ మన పాఠశాలలో ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల ను అన్ని రంగాలలో తీర్చి దిద్దుతున్న ఉపాధ్యాయులు పోషన్న కు కృతజ్ఞతలు తెలిపారు.

ఛైర్మన్ మాట్లాడుతూ,ఏ పాఠశాల లో నైనా చదువు మాత్రమే చెప్పుతారు,కానీ మన పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల సకల నైపుణ్యాలను, విషయ, విజ్ఞానం పెంపొందించే విధంగా తయారు చేయడమే ఉపాధ్యాయులు గా తమ లక్ష్యం అన్నారు.

విద్యార్ధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. చివరికి చక్కటి బోధనా నైపుణ్యాలను ప్రదర్శించిన ప్రధానోపాధ్యాయులు గా వ్యవహరించిన నిహారిక, ఉపాధ్యాయులు గా వ్యవహరించిన చిరుహాసన్,నేహ, వ్యాయామ ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులందరికీ అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు వీరి ఉపాధ్యాయుల వేషాధారణ చూసి చిన్న చిన్న విద్యార్థులు చాలా చక్కగా ముద్దు గా ఉన్నారని మురిసిపోయారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ప్రమీల, శిరీష, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే తొలి మెట్టు ట్రాఫిక్ పోలీసులే

Satyam NEWS

నులి పురుగుల మందు సరఫరా కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

కేరళ అలప్పుజలో ఇద్దరు నేతల హత్య

Sub Editor

Leave a Comment