39.2 C
Hyderabad
May 3, 2024 14: 45 PM
Slider ముఖ్యంశాలు

సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం

#Vijayasaireddy

సోషల్ మీడియా కార్యకర్తలకు తమ పార్టీ పూర్తి భరోసా ఇస్తుందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ అత్యంత అసహ్యకరమైన, అభ్యంతరకరమైన బెదిరింపు పోస్టులను సోషల్ మీడియాలో ప్రచారం చేశారని కీలక ఆధారాలతో రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి 93 మందికి నోటీసులు పంపిన క్రమంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏం జరిగినా అండగా ఉంటామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ‘‘టీడీపీ కవ్వింపు చర్యలకు మా వాళ్ళు పోస్టులు పెట్టారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమీషనర్ వ్యవహారం పై తాము సుప్రీంకోర్టుకు వెళుతున్నామని ఆయన ప్రకటించారు.

ప్రభుత్వం లేకపోయినా చంద్రబాబు తన మనుషులే అధికారులుగా ఉండాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కు అనుకూలం గా తీర్పు వస్తే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

గతం లో కాంగ్రెస్ పార్టీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టినా తాము న్యాయ పరంగానే పొరాడామని ఆయన అన్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై గత ప్రభుత్వం హయాంలో అనేక కేసులు పెట్టారని అయితే ఏం చేయలేకపోయారని విజయసాయిరెడ్డి అన్నారు.

Related posts

కరోనాతో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి

Satyam NEWS

హర్యానా కంపెనీ దగ్గు మందు తాగి ఆఫ్రికాలో పిల్లలు మృతి

Satyam NEWS

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

Murali Krishna

Leave a Comment